వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

11 మంది మృతి: సాయం చేద్దామని వెళ్లి.. తిరిగిరానీ లోకాలకు

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్ బావిలో 30 మంది పడిపోయిన సంగతి తెలిసిందే. అందులో 11 మంది మృతదేహాలను వెలికితీశారు. బాలుడిని తీసే ప్రయత్నంలో భాగంగా అంతమంది బావిలోకి దూకారు. అయితే అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. 19 మందిని కాపాడగలిగారు. కానీ 11 మంది మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాద ఘటన విదిషా జిల్లా గంజ్ బసొడాలో గల లాల్ పాటార్ గ్రామంలో జరిగింది.

11 Dead In Madhya Pradesh Well Tragedy

ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపింది. వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థికసాయం చేస్తామని తెలియజేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తామని సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటించారు. గాయపడ్డవారికి రూ. 50 వేల చొప్పున అందజేస్తామని ప్రకటించారు. ఆ కుటుంబాలకు అండగా ఉంటామని చౌహాన్ తెలిపారు.

మంగళవారం రాత్రి ఓ యువకుడు బావిలో పడిపోయాడు. అతనిని కాపాడేందుకు మిగతా వారు దూకారు. మరికొందరు బావి సమీపంలో గుమికూడారు. అయితే అక్కడ గల పారపెట్ వద్ద ఎక్కడం, ఎక్కువ లోడ్ కావడంతో అదీ కూలిపోయింది. అదీ 50 ఫీట్ల లోతుకు వెళ్లి.. నీరు పైకి వచ్చింది. వెంటనే ట్రాక్టర్ తీసుకొచ్చి సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యలను మంత్రి విశ్వరూప్ సారంగ్ పర్యవేక్షించారు.

English summary
Eleven bodies have been recovered after the rescue operation in Madhya Pradesh's Vidisha district, where 30 people had fallen into a well while trying to rescue a boy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X