టీ గార్డెన్‌లో అనుకోని అతిథి ప్రత్యక్షం.. చూస్తే దిమ్మ తిరిగిపోతుంది

అస్సోంలో టీ గార్డెన్స్‌కు ప్రసిద్ధి. అక్కడ తేయాకు ఎంత విరివిగా పండుతుందో అంతే విరివిగా విషసర్పాల సంచారం కూడా ఉంటుంది. తాజాగా నాగౌన్ జిల్లాలో ఓ భారీ సర్పం ప్రత్యక్ష్యం అయ్యింది. రైతులు తేయాకు ఎస్టేట్‌లో పనిచేస్తుండగా వీరికి ఈ 14 అడుగుల భారీ నాగుపాము కంటపడింది. వెంటనే భయంతో అక్కడి నుంచి పరుగులు తీసి స్థానికంగా ఉండే పాములు పట్టే అతనికి ఫోన్ చేశారు. ఈ భారీ సర్పాన్ని చూసి ఒకరైతే స్పృహ కోల్పోవడం విశేషం.

ఇక పామును చూడగానే తేయాకు ఎస్టేట్‌లో పనిచేసేవారు చంపే ప్రయత్నం చేయలేదు. దులుబోరా అనే పాములు పట్టేవాడికి ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న బోరా పాముకోసం వేట మొదలు పెట్టాడు. బోరాకు పాములతోనే కాదు ఇతర కృూర మృగాలను పట్టుకోవడంలో కూడా దిట్టే. ఇక పాము కోసం వేట మొదలు పెట్టిన బోరా... అది చెట్ట మధ్య నక్కి ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఓ కర్ర తీసుకుని దానికి ఓ హుక్ బిగించి పామును పట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఆ నాగుపాము భారీ బరువు ఉండటంతో ఆ హుక్ ఆనలేదు. కర్ర రెండుగా విడిపోయింది. ఇక చిన్నగా తాను తెచ్చుకున్న బ్యాగులోకి పామును పంపి అటవీశాఖ అధికారులకు కబురు పెట్టినట్లు బోరా తెలిపాడు.

14 feet long Cobra appears in Tea Garden in Estate,rescued

పామును పట్టుకున్న బోరా దగ్గరలోని సువాంగ్ రిజర్వ్ ఫారెస్టులో వదిలేశాడు.ఇప్పటి వరకు గత ఎనిమేదేళ్లలో 21 నాగుపాములను కాపాడినట్లు బోరా చెప్పాడు. సాధారణంగా అస్సోంలో కానీ ఇతర ఈశాన్యరాష్ట్రాల్లో కానీ నాగుపాములు ఎక్కువే. కానీ తాను తాజాగా పట్టుకున్న నాగుపాము మాత్రం చాలా భారీదని చెప్పాడు. తాజాగా పట్టుబడ్డ ఈ 14 అడుగుల నాగుపాముతో తమకు ఒక విషయం అర్థమైందని బోరా చెప్పారు. ఈ ప్రదేశంలో నాగుపాము జాతికి చెందిన ఇతర జాతుల పాములు కూడా సంచరిస్తున్నట్లు ఈ ఘటనతో బయట పడిందని బోరా చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+