Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రశ్నిస్తే పంపుతారా: ప్రొఫెసర్ ప్రతాప్ భానుకు ప్రపంచస్థాయి విద్యావేత్తల మద్దతు

ఢిల్లీ: రాజకీయ ఒత్తిళ్లతో అశోక యూనివర్శిటీకి చెందిన రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ ప్రతాప్ భాన్ మెహతా రాజీనామా చేశారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి యూనివర్శిటీలకు చెందిన విద్యావేత్తలు అండగా నిలిచారు. వీరిలో హార్వర్డ్, యేల్, కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, మరియు మసాచుషెట్స్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పలువురు విద్యావేత్తలు మద్దతుగా నిలిచిన వారిలో ఉన్నారు.

ప్రతాప్ భాను మెహతా రాజీనామాతో ఒక్కసారిగా హర్యానాలోని సోనీపత్‌లో ఉన్న అశోక యూనివర్శిటీ పేరు ఖండాంతరాలకు పాకింది. రెండేళ్ల క్రితం ఆ యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ పదవికి రాజీనామా చేసిన అశోక్ భాను మెహతా... ఇక ప్రొఫెసర్‌గా కూడా కొనసాగరాదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నట్లు తనపై వ్యవస్థాపకులు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రొఫెసర్ పదవి నుంచి వైదొలగేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతాప్ భాను మెహతాకు సంఘీభావంగా ఆర్థికశాఖ ముఖ్యసలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ కూడా రాజీనామా చేశారు. ప్రైవేట్ హోదా కింద ఉన్న అశోక యూనివర్శిటీలో కూడా విద్యా వ్యక్తీకరణ, మరియు స్వేచ్ఛ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు సుబ్రహ్మణ్యన్.

150 Academicians across the globe stand with Pratap Bhanu Mehta,says targetted for writings

భారత్‌లో వాక్‌స్వాతంత్ర్యంకు ఎదురు దెబ్బ తగిలిందని పేర్కొంటూ అశోకా యూనివర్శిటీ ప్రొఫెసర్లుగా రాజీనామా చేసిన ప్రతాప్ భాను మెహతా, అరవింద్ సుబ్రహ్మణ్యంలకు సంఘీభాం తెలిపారు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. ఇక ప్రపంచ వ్యాప్తంగా 150 మంది విద్యావేత్తలు అశోక యూనివర్శిటీ ట్రస్టీలకు బహిరంగ లేఖ రాశారు. రాజకీయపరమైన కామెంట్స్ రాసినందుకే ప్రతాప్ భాను మెహతాను యాజమాన్యం లక్ష్యంగా చేసుకుని బయటకు వెళ్లేలా చేసిందని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం విధానాలపై తన కాలమ్స్‌తో ప్రశ్నిస్తున్నందుకే ప్రతాప్ భాను మెహతా ను టార్గెట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ట్రస్టీలు ఈ విషయంలో కాస్త తెలివిగా వ్యవహరించి ఉండాల్సింది పోయి రాజీనామా చేయాల్సిందిగా బలవంతం పెట్టడం బాధాకరమని అన్నారు. న్యూయార్క్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ, ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ, పెన్సిల్వేనియా యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్లు మద్దతుగా నిలిచారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+