వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిమితో సంబంధాలు లేవు: 17 మంది విడుదల

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వివిధ కేసులలో అరెస్టు అయిన అనుమానిత ఉగ్రవాదులను విడుదల చెయ్యాలని కర్ణాటకలోని హుబ్బళి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హుబ్బళి ఒకటవ అడిషనల్ కోర్టు గురువారం ఈ ఆదేశాలు జారీ చేసింది.

సిమి ముసుగులో దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారని, సిమితో సంబంధాలు సాగిస్తున్నారని ఆరోపిస్తూ హుబ్బళి పోలీసులు 17 మంది అనుమానితులను 2008లో అరెస్టు చేశారు. అప్పటి నుండి వీరు జైలులో ఉన్నారు.

17 suspected SIMI activitsts in connection with various cases of terror.

పోలీసులు విచారణ చేసి నివేదికను న్యాయస్థానంలో సమర్పించారు. అయితే సరైన సాక్ష్యాలు సమర్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలం అయ్యారని, వీరు సిమి కార్యకర్తలు అని నిరూపించలేక పోయారని న్యాయస్థానం గుర్తించింది.

అరెస్టు అయిన వారిలో సఫ్దార్ హుస్సేన్ నగూరితో సహా 17 మంది ఉన్నారు. నగూరి సిమి నాయకుడు అని పోలీసు అధికారులు చాల సందర్బాలలో చెప్పారు. అయితే సాక్ష్యాలు సమర్పించడంలో పోలీసులు మాత్రం విఫలం అయ్యారు. వీరి మీద ఎలాంటి నేరం రుజువు కాలేదని అందుకే విడుదల చేస్తున్నామని న్యాయస్థానం వెల్లడించింది.

English summary
The 1st Additional Magistrate court in Hubbali has acquitted 17 suspected SIMI activists in connection with various cases of terror.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X