జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్... లష్కరే కమాండర్ నసీర్ హతం...

జమ్మూకశ్మీర్‌లోని హంద్వారా జిల్లాలో భారత భద్రతా బలగాలు ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. హంద్వారాలోని గనిపొరా ప్రాంతంలో బుధవారం(అగస్టు 19) రాత్రి 9.30గం. ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. జమ్మూకశ్మీర్ పోలీసులు,భద్రతా బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. హతమైన ఇద్దరు ఉగ్రవాదుల్లో లష్కరే కమాండర్ నసీర్-ఉ-దిన్ లొన్ కూడా ఉన్నాడు. బారాముల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన మరుసటిరోజే మరో ఇద్దరినీ భద్రతా బలగాలు మట్టుబెట్టడం గమనార్హం.

ఈ ఏడాది ఏప్రిల్ 18న సొపొర్‌లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లను,మే 4న హంద్వారాలో మరో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఘటనల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది నసీర్-ఉ-దిన్ లొన్ ప్రమేయం ఉంది.

2 terrorists including a LeT commander killed in Handwara encounter

కాగా,మంగళవారం బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ఉస్మాన్ అనే ఉగ్రవాదిని భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఏడాది జులైలో వసీమ్ బారిలో బీజేపీ నేత హత్య ఘటనలో ఉస్మాన్ ప్రమేయం ఉంది. అంతకుముందు సోమవారం కూడా భద్రతా బలగాలకు,ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు సహా జమ్మూకశ్మీర్‌కి చెందిన ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ మృతి చెందారు. ఈ దాడి అనంతరం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో లష్కరే తోయిబా టాప్ కమాండర్స్ సజద్ హైదర్, ఉస్మాన్ సహా మరో ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి. వీరి నుంచి ఏకె 47 రైఫిల్స్‌తో పాటు మూడు గన్స్‌ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+