ప్రియురాల్ని సంతోషపెట్టాలని, అడ్డంగా బుక్కయ్యాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ప్రియురాలిని సంతోష పెట్టేందుకు, ఆమెకు విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వాలని భావించిన ఓ ప్రియుడు దొంగగా మారాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన కర్నాటకలోని దావణగెరెలో జరిగింది. నిందితుడి పేరు వీరేష్ (27).

అతనికి ఓ ప్రియురాలు ఉంది. తన ప్రియురాలిని సంతోష పెట్టేందుకు డబ్బు అవసరమని భావించి, దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. యూ ట్యూబ్‌లో ఇలాంటి వీడియోలు చూసి దొంగతనాలు ఎలా చేయాలో తెలుసుకున్నాడు.

27 year old robbed to keep girlfriend happy, arrested

ఆసుపత్రులు, రెస్టారెంట్లు, మాల్స్ వద్ద పార్కింగ్ చేసిన కార్ల అద్దాలను పగులగొట్టి అందులో ఉన్న విలువైన ఆస్తులను తీసుకెళ్లేవాడు. బంగారం, డబ్బు దొరుకుతుందని అతను ఎక్కువగా పార్కింగ్‌లో ఉండే కార్లను ఎంచుకున్నాడు. కానీ అతనికి ల్యాప్ టాప్‌లు, మొబైల్ ఫోన్లు ఎక్కువగా దొరికేవి.

ఇటీవల తాను దొంగిలించిన డెబిట్ కార్డుతో హుబ్బలిలో మద్యం కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాడు. కానీ పోలీసులకు చిక్కాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతడిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 12 లాప్ టాప్‌లు, మొబైల్ ఫోన్లు, డెబిట్ కార్డులు, హార్డ్ డిస్క్, ఇతర విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అతనికి 15 దొంగతనాలతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Purchasing liquor by using a debit card he had stolen, landed a youth in police net in Hubballi on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X