డేంజర్ బెల్స్: ఫ్లూ దెబ్బకు జూపార్క్‌లో పులులు, చిరుత మృతి

H5N1 Bird Flu: చైనాలో మెటాన్యుమోవైరస్ (HMPV) శరవేగంగా విస్తోరిస్తోంది. దాదాపుగా ప్రాణాంతక కోవిడ్ 19ను పోలివుండే ఈ వైరస్ వల్ల ఇప్పటికే డ్రాగన్ కంట్రీలో ఆంక్షలు అమలులోకి వచ్చాయి. దీని తీవ్రత నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది.

ఈ పరిస్థితుల మధ్య మహారాష్ట్రలో హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతోంది. దీని బారిన పడి నాగ్‌పూర్‌లో మూడు పులులు, ఓ చిరుత మరణించాయి. ఇక్కడి బాలా సాహెబ్ థాకరే గోరెవాడా జూపార్క్ అండ్ రెస్క్యూ సెంటర్‌లో కిందటి నెలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొదట్లో చంద్రాపూర్‌లో ఉండేవి ఈ వన్యమృగాలు.

3 tigers and a leopard died after contracting H5N1 bird flu in Nagpur

అనారోగ్య బారిన పడటంతో వాటిని గోరేవాడా రెస్క్యూ సెంటర్‌కు తరలించారు. అక్కడ నిపుణుల సంరక్షణలో ఉండేవి. వ్యాధి తీవ్రతరం కావడం వల్ల డిసెంబర్ 20వ తేదీన ఒక పులి చనిపోయింది. అదే నెల 23వ తేదీన మరో రెండు మరణించాయి. వాటి మరణానికి దారి తీసిన వ్యాధి గురించి తెలుసుకోవడానికి రెస్క్యూ సెంటర్‌ సిబ్బంది ప్రయత్నించారు.

వాటి కళేబరాల నుంచి శాంపిల్స్‌ను తీసుకుని భోపాల్‌లోని ఐసీఏఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు పంపించారు. తాజాగా వాటి నివేదికలు మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులకు అందాయి. హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వల్లే మూడు పులులు, ఓ చిరుత మరణించినట్లు ఈ నివేదికల ద్వారా తేలింది.

దీనితో అధికార యంత్రాంగం హైఅలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న అన్ని జులాజికల్ పార్కులు, అభయారణ్యాలు, వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రాలు, వాటి రెస్క్యూ సెంటర్లకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హెచ్5హెచ్1 బర్డ్ ఫ్లూ మరింత విస్తృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+