Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పీపీఏకూ షాక్: బిజెపిలో చేరిన 33మంది ఎమ్మెల్యేలు, ఇక ‘బిజెపి స్టేట్’

అరుణాచల్‌ప్రదేశ్‌లో అధికార ప్రాంతీయ పార్టీ పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ప్రదేశ్‌(పీపీఏ)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 33 మంది ఎమ్మెల్యేలు శనివారం మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టీలో చేరారు.

ఈటానగర్‌: అరుణాచల్‌ప్రదేశ్‌లో అధికార ప్రాంతీయ పార్టీ పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ప్రదేశ్‌(పీపీఏ)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 33 మంది ఎమ్మెల్యేలు శనివారం మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టీలో చేరారు.

ఇక పీపీఏలో కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. పీపీఏలో కొద్దికాలంగా అనిశ్చితి కొనసాగుతున్న విషయం తెలిసిందే. క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారంటూ ముఖ్యమంత్రి పెమాఖండూతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలను రెండు రోజుల క్రితం పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది పీపీఏ.

33 MLAs of the People's Party of Arunachal Pradesh join BJP

కాగా, పెమా ఖండూను సస్పెండ్ చేసిన అనంతరం ఆయన ఎక్కువ రోజులు సీఎంగా కొనసాగరని పీపీఏ అధ్యక్షుడు కఫియా బెంగియా స్పష్టం చేశారు. అతనికి ఎవరు కూడా సహకరించరాదని ఆదేశించారు.

ఈ నేపథ్యంలో 33మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం గమనార్హం. ఎలాంటి షోకాజు నోటీసు కూడా ఇవ్వకుండా తమను సస్పెండ్ చేశారని పెమా ఖండూ శుక్రవారం ఆరోపించారు. ప్రస్తుతం బిజెపిలోకి చేరిన ఎక్కువమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి పీపీఏలోకి చేరినవారే గమనార్హం.

ఇది ఇలా ఉండగా, ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వం నడుస్తోందని ఆ పార్టీ జాతీయ నేత రాంమాధవ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. బిజెపి పరిపాలిస్తున్న 10వ రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్ అని పేర్కొన్నారు. సంకీర్ణంలో నడుస్తున్న 14వ రాష్ట్రమని తెలిపారు. బిజెపి కుటుంబంలోకి సీఎం పెమా ఖండూకు స్వాగతమంటూ ఆయన ట్వీట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+