మోడీ షాక్: ఐటీ దెబ్బ, పండగ రోజు వదల్లేదు, మంత్రి ఇంటిలోనే సోదాలు, నిద్ర !
కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ ఇంటిలో మూడోరోజు శుక్రవారం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.
బెంగళూరు: కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ ఇంటిలో మూడోరోజు శుక్రవారం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. హిందువులకు ఎంతో పవిత్రం అయిన వరమహాలక్ష్మి పండగ రోజు కూడా ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చూస్తూ మంత్రికి చుక్కలు చూపిస్తున్నారు.
బెంగళూరు, మైసూరు, హాసన్ లోని మంత్రి డీకే. శివకుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లో శుక్రవారం సోదాలు చేస్తున్నారు. మంత్రి డీకే. శివకుమార్ కు చెందిన బెంగళూరులోని సదాశివనగర్ లోని ఇంటితో పాటు 40 ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేశారు.

గురువారం అర్దరాత్రి వరకు సోదాలు చేసిన అధికారులు హోటల్ నుంచి బోజనం తెప్పించుకుని అక్కడే ఆరగించి మంత్రి డీకే. శివకుమార్ ఇంటిలోనే నిద్రపోయారు. శుక్రవారం వేకువ జామున 5.30 గంటలకు మళ్లీ సోదాలు మొదలు పెట్టారు.
మంత్రి డీకే. శివకుమార్ సన్నిహితుడు, ప్రముఖ జ్యోతిష్యుడు ద్వారకనాథ్ ఇంటిలో గురువారం రాత్రి పొద్దుపోయిన తరువాత సోదాలు పూర్తి చేసిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని తీసుకెళ్లారని సమాచారం. మైసూరులోని డీకే. శివకుమార్ మామ తిమ్మయ్య ఇంటిలో గురువారం రాత్రి అధికారులు నిద్రపోయారు.
శుక్రవారం వేకువ జామున మళ్లీ తిమ్మయ్య ఇంటిలో సోదాలు మొదలు పెట్టిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. బెంగళూరు నగరంలోని సదాశివనగర్ లోని మంత్రి డీకే. శివకుమార్ సన్నిహితుడు ఆంజనేయులు ఇంటిలో శుక్రవారం సోదాలు చేస్తున్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications