వర్ష బీభత్సం: 48 గంటలు వాన, 3 జిల్లాలకు రెడ్ అలర్ట్

వాస్తవానికి చలికాలం వచ్చినా.. వింత వాతావరణ పరిస్థితి ఉంది. ఇటు చలి పెట్టడం లేదు. అటు ఎండ లేదు.. కానీ ఉక్క పోత మాత్రం ఎక్కువే ఉంది. దీనికితోడు.. అల్పపీడనం, వాయుగుండాలు ఏర్పడి.. అన్నదాత గుండె గుబేల్ అనిపిస్తోంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఇటు కేరళను మళ్లీ వర్షాలు వణికిస్తున్నాయి. ఇక్కడ మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

వచ్చే 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీంతో మూడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్‌ జిల్లాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ ప్రకటించింది. అకాల వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీంతో వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌ సూచించారు. గత మూడు రోజులుగా కేరళలో వర్షాలు దంచి కొడుతున్నాయి. మూడు జిల్లాపై వర్షాల ప్రభావం అధికంగా ఉంది.

 48 hours rain will lashes the kerala

కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు జలమయం అయ్యాయి. ఎర్నాకులంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇడుక్కి, త్రిసూర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. దక్షిణ కేరళలోని పలుప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని వివిధ డ్యామ్‌లలో నీటిమట్టం భారీగా పెరిగింది.

ఇడుక్కి రిజర్వాయర్‌కు చెందిన చెరుతోని డ్యామ్‌లోని ఒక షట్టర్‌ను తెరిచారు. ముల్ల పెరియార్‌ డ్యామ్‌ నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. దీంతో పెరియార్‌ నదికి ఇరువైపులా నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇటు పంట చేతికి వచ్చే సమయంలో కురుస్తోన్న వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వరి పంట చేతికి వచ్చింది. వర్షాలు పడటంతో.. నీటితో తడిగా ఉంటుంది. దీంతో మిషన్ల ద్వారా కోత మరింత కష్టం అవుతుంది. వరుణ దేవ తమను కరుణించు అని అన్నదాతలు వేడుకుంటున్నారు. కానీ తుపానులు, అల్పపీడనలు ఏర్పడుతున్నాయి. దీంతో రైతన్న బిక్కు బిక్కుమంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+