బెంగళూరులో కుప్పకూలుతున్న విద్యుత్ స్థంభాలు, కాలిపోతున్న ట్రాన్స్ ఫార్మర్లు !
బెంగళూరు: బెంగళూరు సిటీతో పాటు కర్ణాటకలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, భారీ గాలుల దెబ్బకు పెద్దపెద్ద చెట్లతో పాటు విద్యుత్ స్థంభాలు నేలమట్టం అవుతున్నాయి. బెంగళూరు సిటీ పరిధిలో బెస్కామ్ కు చెందిన సుమారు 540 విద్యుత్ స్థంభాలు కుప్పకూలడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బెంగళూరు సిటీతో పాటు కర్ణాటకలోని అనేక జిల్లాల్లో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు, గాలులకు బీబీఎంపీ పరిధిలో చాలా చెట్లు కుప్పకూలి విద్యుత్ స్థంభాల మీద పడ్డాయి. భారీ చెట్లు విద్యుత్ స్థంభాల మీదపడటంతో బెస్కామ్ కు చెందిన విద్యుత్ స్థంభాల వైర్లు తెగిపోయి కింద కుప్పకూలిపోవడంతో విద్యత్ సరఫరా ఆగిపోయంది.

భారీ వర్షాల దెబ్బకు బీబీఎంపీ పరిధిలో బెస్కామ్ కు చెందిన 140 విద్యుత్ స్థంభాలు పూర్తిగా విరిగిపోయాయి. బెంగళూరులో సోమవారం సాయంత్రం వరకు సుమారు 540 విద్యుత్ స్థంభాలు కూలిపోయాయని, పలు చోట్ల విద్యుత్ సరఫరా ఆగిపోయిందని, మరమత్తులు చేసి వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా చేస్తామని బెస్కామ్ అధికారులు అంటున్నారు.

540 విద్యుత్ స్థంభాలతో పాటు 40కి పైగా ట్రాన్స్ ఫార్మర్లు పూర్తిగా కాలిపోయాయని అధికారులు అంటున్నారు. కొత్త ట్రాన్స్ ఫార్మర్లు బిగించి త్వరలో విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, అంత వరకు ప్రజలు సహకరించాలని బెస్కామ్ అధికారులు అంటున్నారు. మొత్తం మీద భారీ వర్షాల దెబ్బలకు బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లోని చెట్లు, విద్యుత్ స్థంభాలు కుప్పకూలిపోతున్నాయి. అయితే విద్యుత్ స్థంభాలు కూలిపోవడం వలన ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బెస్కామ్ అధికారులు అంటున్నారు.
-
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications