Borewell: బోరుబావిలో ఏడేళ్ల బాలుడు.. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభం..
మధ్యప్రదేశ్ లో 7 ఏళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు.
మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో ఈరోజు 7 ఏళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. అతడిని రక్షించేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. జిల్లాలోని లాటరి తహసీల్ పరిధిలోని ఖేర్ఖేడీ పత్తర్ గ్రామంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో లోకేష్ అహిర్వార్ అనే బాలుడు ఆడుకుంటూ బోరు బావిలో జారి పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్ చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ఆపరేషన్ ప్రారంభించిందని లాటరి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ హర్షల్ చౌదరి తెలిపారు. జేసీబీ యంత్రాన్ని (ఎర్త్‌మూవర్) అమర్చడం ద్వారా చిన్నారిని సురక్షితంగా రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బాలుడి పరిస్థితిని తెలుసుకోవడానికి కెమెరాను కూడా బోర్‌వెల్‌లోకి దించారు.

అటు మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం పొలంలో 200 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడు మంగళవారం మృతి చెందాడు. మరణించిన బాలుడిని సాగర్ బుధా బరేలాగా గుర్తించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అతని కుటుంబం మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లా నుంచి అహ్మద్‌నగర్‌కు వలస వచ్చారు.
జిల్లాలోని కర్జాత్ తాలూకాలోని కోపర్డి గ్రామంలో స్థానిక రైతు కాకాసాహెబ్ సుద్రిక్‌కు చెందిన చెరకు పొలంలో సాయంత్రం 4 గంటల సమయంలో బాలుడు బోరుబావిలో పడిపోయాడని అహ్మద్‌నగర్ పోలీసు అధికారులు తెలిపారు. బాలుడు బోరుబావిలో దాదాపు 20 అడుగుల లోతులో ఇరుక్కుపోయినట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ చేసి బాలుడి బయటకు తీయగా అతను చనిపోయినట్లు గుర్తుంచారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications