లోయలో పడిపోయిన వాహనం: పెళ్లి బృందంలో 8 మంది దుర్మరణం
సిమ్లా: పెళ్లి బృందం వెళ్తున్న వాహనం లోయలో పడిపోయి 8 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా సమీపంలో జరిగింది. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున పెళ్లి బృందం ప్రతేక వాహనంలో ప్రయాణిస్తున్నారు.
ఆ సమయంలో ఒక మలుపులో వెలుతున్న సమయంలో వాహనం అదుపు తప్పి.. సుమారు 200 అడుగుల లోతులో ఉన్న లోయలోకి వాహనం పడిపోయింది. వాహనంలో ఉన్న వారు చెట్లు, రాళ్ల మద్య చిక్కుకున్నారు. నిమిషాల వ్యవధిలో వాహనం లోయలోకి పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న చంబా జిల్లా ఏఎస్పీ కుల్వత్ ఠాగూర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

చంబా జిల్లా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిని వారిని రక్షించి చంబా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మలుపులో వేగంగా వెళ్తున్న వాహనాన్ని డ్రైవర్ అదుపు చెయ్యలేకపోవడం వలనే ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది.
మరణించిన వారందరు చంబా జిల్లాకు చెందిన వారేనని, ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్ మరణించాడని పోలీసులు చెప్పారు. పెళ్లి బృందంలో 8 మంది చనిపోవడంతో విషాదచాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వెంటనే ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని జిల్లా పోలీసులు, జిల్లాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications