ఘోరం: తుపాకితో బాలుడి సెల్ఫీ.. అదికాస్తా పేలి..

ఎనిమిదేళ్ల బాలుడు చేతిలో తుపాకీ పట్టుకొని సెల్ఫీ తీసుకునేందుకు యత్నించగా అది కాస్తా పేలి బుల్లెట్ అతని తలలోకి దూసుకెళ్లిన ఘటన ఘజియాబాద్ నగరంలో వెలుగుచూసింది.

ఘజియాబాద్ : ఎనిమిదేళ్ల బాలుడు చేతిలో తుపాకీ పట్టుకొని సెల్ఫీ తీసుకునేందుకు యత్నించగా అది కాస్తా పేలి బుల్లెట్ అతని తలలోకి దూసుకెళ్లిన ఘటన ఘజియాబాద్ నగరంలో వెలుగుచూసింది.

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ నగరానికి చెందిన జునైద్ అనే 8 ఏళ్ల బాలుడు పక్కింటి కలీ అనే వ్యక్తి వద్దనుంచి తుపాకీ తీసుకున్నాడు. జునైద్ చేత్తో తుపాకీ పట్టుకొని స్నేహితులతో కలిసి తన మొబైల్ ఫోన్ తో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించాడు.

8-year-old boy 'accidentally' shoots himself while clicking selfie

అంతలో తుపాకీ ట్రిగ్గర్ ఒత్తుకొని ఆ తుపాకీ కాస్తా పేలి బుల్లెట్ అతడి తలలో నుంచి దూసుకుపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జునైద్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం జునైద్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మరోవైపు అక్రమంగా తుపాకీ ఉంచుకున్న కలీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+