కత్తితో బెదిరించి, ఆపై అఘాయిత్యం.. ఎనిమిదేళ్ల చిన్నారిపై...
భారతదేశం అత్యాచార దేశంగా మారుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రియాంక ఉదంతం నుంచి పూటకో ఘటన వెలుగుచూస్తూనే ఉన్నాయి. దీంతో పేరెంట్స్ గజ గజ వణికిపోతున్నారు. తమ పిల్లలను బయటకి పంపించాలంటేనే భయపడిపోతున్నారు.
గుజరాత్‌లోని రాజ్‌కోట్ వద్ద గల పార్కులో తన తల్లితో కలిసి ఎనిమిదేళ్ల చిన్నారి నిద్రపోతోంది. రోజు కూలీ పనులు చేసే ఆ తల్లి ఆలసిపోయిందో ఏమో కానీ.. శుక్రవారం రాత్రి తన బిడ్డపై రెప్పపాటు నిర్లక్ష్యం వహించింది. దీంతో మృగాళ్లు రంగప్రవేశం చేశారు. చిన్నారిని ఎత్తుకెళ్లిపోయారు.

చిన్నారిని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లారు. తర్వాత చిన్నారిని కొట్టారు. ఆమెకు కత్తి చూపి మరీ లైంగికదాడికి పాల్పడ్డారు. తమ కామవాంఛ తీర్చుకున్నాక బస్సుల్లో వదిలేసి వెళ్లిపోయారు. ఆ మరునాడు ఉదయం చిన్నారి తల్లి వద్దకు చేరింది. గాయాలు ఉండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసి.. లైంగికదాడి జరిగినట్టు గుర్తించారు
చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు. నిందితుల ఆచూకీ తెలిపితే రూ.50 వేలు అందిస్తామని పోలీసులు తెలిపారు. కిడ్నాప్, లైంగికదాడి, పోక్సో తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications