వధువుకు సాష్టాంగ నమస్కారం చేసిన వరుడు.. పిక్ వైరల్, 9 కారణాలట..?
21వ శతాబ్దం. ఆధునీకత పేరుతో ఆచార, సాంప్రదాయాలు అంతంతే.. కానీ కొన్ని చోట్ల మాత్రం ఆచార, వ్యవహరాలు కొనసాగుతున్నాయి. పెద్దలంటే గౌరవం, సనాతన హిందు ధర్మం ప్రకారం నడుచుకుంటున్నారు. మరికొందరు భార్య అంటే తక్కువ కాదని చెబుతున్నారు. ఇటీవల ఓ వరుడు.. తన భార్య చేత తాళి కట్టించుకున్న సంగతి తెలిసిందే. అదీ తెగ వైరల్ కూడా అయ్యింది. ఇప్పుడో వరుడు.. తన భార్య కాళ్లకు నమస్కారం చేశాడు. ఆ పిక్ కూడా నెట్టింట్ తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.

భార్య కాళ్లకు నమస్కారం
వేదమంత్రోఛ్చారణ మధ్య వివాహం జరగగా.. వధూవరులు దండలు మార్చుకున్నారు. తర్వాత పెళ్లి కొడుకు అనూహ్యంగా పెళ్లి కూతురి కాళ్లకు నమస్కారం చేశాడు. అది చూసి పెళ్లికొచ్చిన బంధువులు, వధూవరుల స్నేహితులు, శ్రేయోభిలాషులు షాక్ తిన్నారు. సంప్రదాయానికి భిన్నంగా ఓ కొత్త ఒరవడికి తెర తీసిన పెళ్లికొడుకు.. వధువు కాళ్లకు దణ్ణం పెట్టిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

9 కారణాలు
దీనికి సంబంధించి వరుడు డిఫరెంట్‌గా స్పందించాడు. వధువు కాళ్లకు దణ్ణం పెట్టటానికి ఒకటీ రెండూ కాదు ఏకంగా తొమ్మిది కారణాలు ఉన్నాయని వివరించాడు. తన వంశాన్ని అభివృద్ధి చేయటానికి వచ్చే ఆమెకు దణ్ణం పెట్టటం తన బాధ్యతగా భావించానని తెలిపారు. తన జీవితంలో సంతోషాన్ని తెచ్చే భార్యకు దండం పెడితేతప్పేంటి అంటూ ప్రశ్నించాడు.

అందరినీ వదలి
కన్నవారిని..తన బంధువుల్ని వదిలి తనతో మూడు ముళ్లు వేయించుకుని భార్య అయిన ఆమెకు ఆ మాత్రం గౌరవం ఇవ్వాలని చెప్పాడు. ఇది తనకు ఇచ్చే గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. దీనిని కూడా నెటిజన్ సోషల్ మీడియాలో పెట్టాడు. వరుడు పాదాభివందనం చేసిన దృశ్యాన్ని కలిపి షేర్ చేశాడు. ఫోటోతోపాటు సదరు వరుడు చెప్పిన కారణాలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications