• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్‌కు భారీ షాక్: వారంలోనే రెండోసారి జరిమానా, రూ. 936 కోట్లు, ఎందుకంటే?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దిగ్గజ సెర్చింజన్ సంస్థ గూగుల్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గూగుల్ తన ప్లే స్టోర్ ద్వారా పోటీ వ్యతిరేక పద్ధతులను అవలంభిస్తోందంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) భారీ జరిమానా విధించింది.

గూగుల్ మార్కెట్ గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ మంగళవారంనాడు రూ. 936.44 కోట్ల భారీ జరిమానాను వేసింది. తన పద్ధతి మార్చుకోవాలని తేల్చి చెప్పింది. గూగుల్‌కు జరిమానా విధించడం వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం.

కాగా, యాప్ డెవలపర్లు తమ యాప్.. యూజర్లకు చేరాలంటే యాప్ స్టోర్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే, మనదేశంలో వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్లలో చాలా వరకు ఆండ్రాయిడ్‌వే ఉన్నాయి. దీంతో యాప్ డెవలపర్లకు ప్లేస్టోర్ ఒక్కటే ఆధారంగా మారింది.

గూగుల్ ప్లేస్టోర్‌లో తమ యాప్ లిస్ట్ కావాలంటే గూగుల్ నియమాలను పాటించాలి. అంతేగాక, గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టమ్ ను అనుసరించాల్సి ఉంటుంది. దీంతో గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని సీసీఐ గమనించింది. ఈ క్రమంలోనే గూగుల్ కు భారీ జరిమానా విధించింది.

₹ 936 Crores: Googles Second Fine In India In Less than A Week

దీంతో వారం రోజులు కూడా తిరగక ముందే గూగుల్‌పై సీసీఐ రెండోసారి జరిమానా విధించినట్లయింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఎకో సిస్టమ్ తో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందంటూ రూ. 1337.76 కోట్లు జరిమానా విధించాలని ఆదేశించింది. దీంతో మొత్తం పరిమానా 2274 కోట్లకు చేరింది. కాగా, తాజా జరిమానాపై గూగుల్ ఇంకా వ్యాఖ్యానించలేదు.

గూగుల్ ప్లే స్టోర్ విధానాల ప్రకారం, గూగుల్ ప్లే స్టోర్ ద్వారా పంపిణీ చేయబడిన లేదా విక్రయించబడే యాప్‌లకు, కొన్ని యాప్‌లో కొనుగోళ్లకు చెల్లింపులను ఆమోదించడానికి యాప్ డెవలపర్‌లు గూగుల్ ప్లే యొక్క బిల్లింగ్ సిస్టమ్ (GPBS)ని తప్పనిసరిగా ఉపయోగించాలి.

అదనంగా, యాప్ డెవలపర్‌లు యాప్ వెలుపల డిజిటల్ ఐటెమ్‌ను కొనుగోలు చేయమని వినియోగదారులను ప్రోత్సహించే పదాలను చేర్చలేరు లేదా యాంటీ-స్టీరింగ్ ప్రొవిజన్‌లు అని పిలువబడే ప్రత్యామ్నాయ చెల్లింపు పద్ధతిని ఆమోదించే వెబ్‌సైట్‌కి యాప్‌లో నేరుగా లింక్‌ను చేర్చలేరు.

English summary
₹ 936 Crores: Google's Second Fine In India In Less than A Week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X