ప్రియురాలి పెదవులకు ఫెవిక్విక్ అంటించి, కారం పొడి పోసిన శాడిస్టు ప్రియుడు ఏం చేశాడంటే?

ప్రేమ పేరుతో అమ్మాయిలను నిలువునా మోసం చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రేమను నిరాకరించిన అమ్మాయిలను కత్తితో పొడిచి చంపేస్తున్న యువకులు శాడిస్టులుగా తయారౌతున్నారు. వేరే మతం అమ్మాయిలను ప్రేమ పేరుతో లొంగదీసుకుని బలవంతంగా మతం మార్చుకునేలా చేస్తున్న అనేక ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

ఇప్పుడు ఇంతకంటే ఘోరమైన సంఘటన వెలుగు చూడటంతో ప్రజలు హడలిపోయారు. ప్రేమ పేరుతో డ్రామాలు ఆడిన నిందితుడు అయాన్ పఠాన్ అలియాస్ అయాన్ అనే నిందితుడు 23 ఏళ్ల యువతిని గదిలో నిర్బందించి ఆమెపై అత్యాచారం చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో చోటుచేసుకుంది. నిందితుడు ఆ యువతి నోటిలో కారం పొడి పోసి, పెదవులకు ఫెవిక్విక్ గమ్ అంటించి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

A boyfriend who raped his girlfriend by putting pepper in her mouth and putting Feviquik on her lips in Madhya Pradesh

తీవ్రంగా గాయపడిన యువతి ఆసుపత్రిలో చేరిందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడు అయాన్ పఠాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.యువతి ఇంటి పక్కనే నిందితుడు అయాన్ పఠాన్ నివాసం ఉంటున్నాడని పోలీసులు అన్నారు. నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని అయాన్ పఠాన్ ఆ యువతితో డ్రామాలు ఆడాడు. చాలా కాలం నుంచి యువతి వెంట తిరిగిన అయాన్ పఠాన్ చివరికి ఆమెను లొంగదీసుకున్నాడని పోలీసులు అన్నారు.

తరువాత నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆ యువతి వెంట తిరిగాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు వారి కుమార్తెను హెచ్చరించారని, అయాన్ పఠాన్ కు దూరంగా ఉండాలని, వాడు శాడిస్టు అని ఆమెకు నచ్చ చెప్పారని పోలీసులు అన్నారు. యువతి పేరుతో ఆస్తులు ఉన్నాయని, ఆ ఆస్తిని కొట్టేయడానికి అయాన్ పఠాన్ ఆమెను లొంగదీసుకోవడానికి ప్రేమ పేరుతో నాటకాలు వేశాడని పోలీసులు అన్నారు. అయాన్ పఠాన్ మాత్రం ఆ యవతిని వెంట వేసుకుని తిరగడంతో ఆ యువతి బంధువులు అందరికి విషయం తెలిసిపోయింది.

తరువాత భయపడిపోయిన యువతి కుటుంబ సభ్యులు అందరూ ఇల్లు ఖాళీ చేసి వేరే గ్రామానికి వెళ్లిపోయారు. అయితే అయాన్ పఠాన్ ప్రేమించిన యువతికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటాను అని నమ్మించడంతో ఆ యువతి మళ్లీ అతని దగ్గరకు వెళ్లిపోయిందని పోలీసులు అన్నారు. పెళ్లి చేసుకుంటాడని ప్రియుడు అయాన్ పఠాన్ దగ్గరకు వెళ్లిన యువతిని ఓ ఇంటికి పిలుచుకుని వెళ్లాడు. తరువాత నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నీ పేరుతో ఉన్న ఆస్తి తన పేరు మీద రాసివ్వాలని అయాన్ పఠాన్ ఆ యువతి మీద ఒత్తిడి చేశాడు.

A boyfriend who raped his girlfriend by putting pepper in her mouth and putting Feviquik on her lips in Madhya Pradesh

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇంటికి తీసుకెళ్లిన తరతువా ఆస్తిని తన పేరున రిజిష్టర్‌ చేయాలని అయాన్ పఠాన్ డిమాండ్‌ చేయడంతో ఆ యువతి హడలిపోయింది. మోసపోయానని గ్రహించిన యువతి అక్కడి నుంచి తప్పించుకోవానికి ప్రయత్నించింది. ఆస్తి రాసివ్వడానికి ఆ యువతి ప్రతిఘటించడం ప్రారంభించింది. అయితే అయాన్‌ పఠాన్‌ ఆమెను గదిలో కట్టేసి నోటిలో లవణం, కారం పొడి పోసి ఆమె కేకలు వెయ్యకుండా పెదాలకు ఫెవిక్విక్ గమ్‌తో అతికించి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు.

అయితే స్థానికులకు విషయం తెలియడంతో వారి సాయంతో ఈ కేసు వెలుగులోకి వచ్చిందని పోలీసులు అన్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన యువతిని రక్షించిన స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు అయాన్‌ పఠాన్‌ను అరెస్టు చేశారు. ఇప్పుడు న్యాయం చేయాలని యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. ఆస్పత్రిలో చేరిన యువతి చికిత్స పొందుతోంది.నిందితుడు అయాన్‌పై పోలీసులు వివిద సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+