యజమానికే కుచ్చుటోపీ పెట్టిన కారు డ్రైవర్, డిక్కీలో కోటి స్వాహా, గర్ల్ ఫ్రెండ్స్ తో ?

బెంగళూరు: ప్రముఖ వ్యాపారికి చెందిన డబ్బును అతని కారు డ్రైవర్ చోరీ చేసి యజమానికి టోపీ పెట్టిన ఘటన కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని గాంధీనగర్‌లో చోటుచేసుకుంది.

యజమాని డబ్బును బెంగళూరులో దోచుకున్న డ్రైవర్ అతని గర్ల్ ఫ్రెండ్ తో పాటు స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేశారు. అంతర్రాష్ట్రాల్లో వక్కల వ్యాపారం చేస్తున్న ఉమేష్‌కు చెందిన కోటి రూపాయలను అతని కారు డ్రైవర్ పక్కాప్లాన్ తో చోరీ చేశాడు.

A car driver caught in Bengaluru after stealing crores of rupees from the owners car

కారు డ్రైవర్ సంతోష్ డబ్బు దొంగిలించి ఇప్పుడు పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ఉమేష్ వ్యాపారం చేస్తున్నాడు. కర్ణాటకలోని వివిధ జిల్లాల్లోని వక్కలు కొనుగోలు చెయ్యడానికి వచ్చాడు. కర్ణాటకలోని చిత్రదుర్గలో వక్కలు కొనుగోలు చేసేందుకు కారులో ఒక కోట రూపాయలు డబ్బులు పెట్టుకుని వచ్చాడు.

అయితే కారు యజమాని ఉమేష్ కు తెలియకుండా డ్రైవర్ సంతోష్ తన ముగ్గురు సహచరులతో కలిసి డబ్బును చోరీ చేశాడు. వ్యాపారి ఉమేష్ అక్టోబరు 7వ తేదీన వక్కల వ్యాపారం కోసం చిత్రదుర్గ, శిరా, తుమకూరు మీదుగా బెంగళూరులోని గాంధీనగర్‌కు వచ్చాడు. ఉమేష్ బ్యాగ్‌లో కోటి డబ్బు పెట్టుకుని కారు డ్రైవర్ సంతోష్ తో కలిసి బెంగళూరు వచ్చాడు.

A car driver caught in Bengaluru after stealing crores of rupees from the owners car

డబ్బును కారులో వదిలేసి గాంధీనగర్‌లోని ఓ హోటల్‌ ముందు భోజనం చేసేందుకు వెళ్లారు. ఆ తర్వాత చంద్రలేఅవుట్ సమీపంలో కారును ఆపారు. రాత్రి 7.45 గంటలకు భీమసముద్ర దుకాణానికి వెళ్లి కారు డిక్కీ పరిశీలించారు. అయితే కారు డిక్కీలో డబ్బు చోరీ అయిన విషయం గుర్తించిన వ్యాపారి ఉమేష్ బెంగళూరులోని ఉప్పరపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

A car driver caught in Bengaluru after stealing crores of rupees from the owners car

కాయల వ్యాపారి ఫిర్యాదు మేరకు ఉప్పరపేట పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కారు డ్రైవర్ సంతోష్ మీద అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అయితే నిందితులు అప్పటికే రూ 10 లక్షలు ఖర్చు పెట్టేశారని తెలుసుకున్న పోలీసులు 90 లక్షలు స్వాధీనం చేసుకుని వ్యాపారి ఉమేష్ కు అప్పగించారు. కారు డ్రైవర్ సంతోష్ అతని గర్ల్ ఫ్రెండ్ తో కలిసి విలాసవంతమైన హోటల్స్ కు వెళ్లి పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+