కాలేజ్ ముందే అమ్మాయిని ?, షూటింగ్ కాదు రియల్ గానే సినిమా చూపించి జంప్ !
బెంగళూరు/రామనగర్: ఓ యువతి కాలేజ్ లో చదువుతోంది. ప్రతిరోజు ఉదయం కాలేజ్ కు వెలుతున్న యువతి సాయంత్రం కాలేజ్ పూర్తి అయిన తరువాత ఇంటికి వెలుతోంది. ఎప్పటిలాగే ఉదయం ఆ అమ్మాయి కాలేజ్ కు వెళ్లింది. కాలేజ్ దగ్గర ఫ్రెండ్స్ తో కలిసి నడుచుకుంటూ వెలుతున్న సమయంలో ఇన్నోవా కారులో వచ్చిన వాళ్లు అక్కడ నిమిషంలో కాలేజ్ అమ్మాయిలు అందరికి సినిమా చూపించారు.
పట్టపగలు ఓ యువతిని కత్తితో పొడిచి అపహరించిన ఘటన కర్ణాటకలోని రామనగరలోని ప్రభుత్వ మహిళా కళాశాల సమీపంలో చోటుచేసుకుంది. బెంగళూరు నగర శివార్ల జిల్లా అయిన రామనగరలోని ప్రభుత్వ మహిళా కళాశాల సమీపంలోకి ఇన్నోవా కారులో వచ్చిన నిందితులు ముందుగా కాలేజ్ అమ్మాయి చేతిపై, భుజంపై కత్తితో పొడిచి ఆమె తప్పించుకోకుండా ప్లాన్ చేశారు.

అనంతరం సినిమా స్టైల్‌లో ఇన్నోవా కారులో ఆమెను బలవంతంగా ఎక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యారు. రామనగర పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. ప్రస్తుతం కాలేజీ విద్యార్థిని కిడ్నాప్ కేసు నమోదు చేసిన రామనగర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రామనగర టౌన్ పోలీసులు ఇప్పటికే స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
కళాశాల విద్యార్థినిని పట్టపగలు కాలేజ్ సమీపంలో అందరూ చూస్తున్న సమయంలోనే బహిరంగంగా దుండగులు కిడ్నాప్ చేయడంతో స్థానికులు, రామనగర ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు, కాలేజ్ అమ్మాయిల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థిని కిడ్నాప్ చెయ్యడం వెనుక వారి ఉద్దేశం ఏమిటి ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు..

నిందితుల గుర్తింపు, అపహరణకు గురైన వారి డిమాండ్ లు తదితర అంశాలపై పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కాలేజీ అమ్మాయి అపహరణ కేసుకు సంబంధించి రామనగర పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ చేసిన కేసులో ప్రధాన నిందితుడిని చేతన్ గా గుర్తించామని, గాయపడిన కాలేజ్ విద్యార్థిని రామనగరలోని రామకృష్ణ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు అన్నారు. అయితే కాలేజ్ అమ్మాయి భవిష్యత్తు నాశనం కాకుండా పూర్తి సమాచారం చెప్పడం సాద్యం కాదని పోలీసులు అంటున్నారు .












Click it and Unblock the Notifications