బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Constable: కన్నింగ్ కానీస్టేబుల్, లక్షల్లో లంచం, బ్యాంక్ అకౌంట్ లో జమ, క్రికెట్ బెట్టింగ్, రివర్స్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరులో కొందరు పోలీసులు ఏరైంజ్ లో అమాయక ప్రజలను పీక్కుతింటారో కొత్తగా చెప్పనవసరం లేదు. కానీస్టేబుల్స్ ఎక్కువగా లంచాలు వసూలు చేస్తున్నారని, అనవసరంటా ట్రాఫిక్ పోలీసులు వాహనచోదకుల నుంచి డబ్బులు లాగేసుకుంటున్నారని ఇప్పటికే అనేక ఆరోపణలు ఉచ్చాయి. వ్యాపారి దగ్గర ఎంతో నమ్మకంగా పని చేస్తున్న వ్యక్తి రూ. 10 లక్షల నగదు తీసుకుని వెలుతుంటే అది హవాలా సొమ్ము అని బెదిరించిన పోలీసు అతని బ్యాంక్ అకౌంట్ లో లక్షల డబ్బు ఆన్ లైన్ ట్రాన్సఫర్ చేయించుకుని అడ్డంగా బుక్కైపోయాడు.

Wife: ఆ ఊరు పేరు చెబితే ?, మరో మహిళను నరబలి ఇవ్వాలని బాయ్ ఫ్రెండ్ మంత్రగాడు ? జస్ట్ !Wife: ఆ ఊరు పేరు చెబితే ?, మరో మహిళను నరబలి ఇవ్వాలని బాయ్ ఫ్రెండ్ మంత్రగాడు ? జస్ట్ !

వ్యాపారి చేతికి రూ. 10 లక్షల క్యాష్ వచ్చింది

వ్యాపారి చేతికి రూ. 10 లక్షల క్యాష్ వచ్చింది

ఓ కానీస్టేబుల్ ఓ వ్యాపారి దగ్గర పని చేస్తున్న వ్యక్తిని అడ్డగించి ఒక్కడీల్ తో లక్షల రూపాయలు లాగేసుకుని అడ్డంగా బుక్కైపోయాడు. బెంగళూరు నగరంలో ప్రముఖ వ్యాపారవేత్త నివాసం ఉంటున్నాడు. ఆ వ్యాపారి దగ్గర రాజురామ్ అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. వ్యాపారలావాదేవీలతో ఆ వ్యాపారి చేతికి రూ. 10 లక్షలు నగదు వచ్చింది.

 డబ్బుల వాసన పసిగట్టిన పోలీసు

డబ్బుల వాసన పసిగట్టిన పోలీసు


10 లక్షల రూపాయల డబ్బులు రాజురామ్ దగ్గరుకు ఇచ్చిన వ్యాపారి తన ఇంటిలో ఆ డబ్బులు ఇవ్వాలని చెప్పాడు. రాజురామ్ స్కూటల్ లో యజమాని ఇంటికి బయలుదేరాడు. మార్గం మద్యలో హలసూర్ గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సున్నకల్లపేట్ లోని అణ్ణమ్మదేవి స్ట్రీట్ లో గోవిందరాజనగర పోలీస్ స్టేషన్ లో కానీస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న ఆనంద్ అనే యువకుడు అడ్డగించాడు.

హవాలా సొమ్ము అంటూ హంగామా

హవాలా సొమ్ము అంటూ హంగామా

బెంగళూరు సిటీ పోలీసు ఐడీ కార్డు చూపించిన కానీస్టేబుల్ ఆనంద్ వ్యాపారి దగ్గర పని చేస్తున్న రాజురామ్ ను బెదిరించాడు. మీరు హవాలా సొమ్ము తారుమారు చేస్తున్నారని మాకు సమాచారం వచ్చిందని, నీ దగ్గర భారీ మొత్తంలో డబ్బులు ఉందని మాకు తెలిసిందని, మర్యాదగా చెప్పినట్లు వినకుంటా నిన్ను జైల్లో పెడుతానని రాజురామ్ ను కానీస్టేబుల్ ఆనంద్ బెదిరించాడు.

ఆన్ లైన్ లో రూ. 2 లక్షలు లూటీ

ఆన్ లైన్ లో రూ. 2 లక్షలు లూటీ

భయపడిపోయిన రాజురామ్ అతని స్నేహితుడికి ఫోన్ చేసి ఆనంద్ చెప్పిన బ్యాంక్ అకౌంట్ కు రూ. 2 లక్షలు డబ్బులు జమ చేశాడు. డబ్బులు వచ్చాయని తెలిసిన తరువాత కానీస్టేబుల్ ఆనంద్ రాజురామ్ ను వదిలేసి వెళ్లిపోయాడు. తరువాత రాజురామ్ అతని యజమానికి జరిగిన స్టోరీ మొత్తం చెప్పాడు.

 సీసీటీవీ కెమెరాల్లో ?

సీసీటీవీ కెమెరాల్లో ?

రాజురామ్ ను వెంటపెట్టుకుని హలసూరు గేట్ పోలీస్టేన్ కు వెళ్లిన వ్యాపారి ఆ పోలీసు మీద కేసు పెట్టాడు. సీసీటీవీ కెమెరాలు పరిశీలించి, రాజురామ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా, రూ. 2 లక్షలు నగదు డిపాజిట్ అయిన బ్యాంక్ అకౌంట్ సాక్షంతో గోవిందరాజనగర పోలీస్ స్టేషన్ కానీస్టేబుల్ ఆనంద్ ను హలసూర్ గేట్ పోలీసులు అరెస్టు చేశారు.

 కన్నింగ్ కానీస్టేబుల్ క్రికెట్ బెట్టింగ్ లు

కన్నింగ్ కానీస్టేబుల్ క్రికెట్ బెట్టింగ్ లు

క్రికెట్ బెట్టింగ్ తో పాటు చెడు అలవాట్లకు బానిస అయిన ఆనంద్ విపరీతంగా అప్పులు చేశాడని, చేసిన అప్పులు తీర్చడానికి వచ్చే జీతం సరిపోలేదని, అప్పు ఇచ్చిన వారు డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారని, అందుకే లూటీలు చేస్తున్నాడని, గతంలో కూడా ఇలా ఏమైనా చేశాడని అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
A constable who threatened an innocent person and deposited a bribe of 2 lakhs in a bank account in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X