ప్రేమ పెళ్లి, దంపతులపై దాడి, ఇద్దరికీ మూత్రం తాగించిన యువతి కుటుంబ సభ్యులు !
హరదాస్ పుర: కుటుంబ సభ్యులను ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు ప్రేమికులకు చిత్రహింసలు పెట్టారు. కుమార్తె అని కూడా చూడకుండా నగ్నంగా తయారు చేసి చితకబాదేశారు. యువకుడిని నడి రోడ్డులో పట్టుకుని అతని మీద తీవ్రస్థాయిలో దాడి చేసి మూత్రం తాగించిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.
మధ్యప్రదేశ్ లోని హరదాస్ పురలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు చాల కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటామని వారి కుటుంబ సభ్యులకు యువతి, యువకుడు చెప్పారు. పెళ్లి చేసుకోవడాని యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు.

ఇటీవల యువతి, యువకుడు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని కాపురం పెట్టి సంతోషంగా గడుపుతున్నారు. పెళ్లి చేసుకుని కాపురం పెట్టడంతో యువతి కుటుంబ సభ్యులు రగిలిపోయారు.
యువతి కుటుంబ సభ్యులు నవ దంపతులను నడి రోడ్డు మీదకు లాక్కొని వచ్చారు. ఇద్దరినీ ఇష్టం వచ్చినట్లు చితకబాదేశారు. కుమార్తె అనే కనికరం లేకుండా యువతి బట్టలు చింపేశారు. మమ్మల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటారా అంటూ యువతి, యువకుడి మీద దాడి చేశారు.
నవదంపతులకు బలవంతంగా మూత్రం తాగించిన కసాయివాళ్లు మీ అంతుచూస్తాం అంటూ వెళ్లి పోయారు. తాము ఇద్దరూ ప్రేమించుకుని జీవితాంతం కలిసి ఉండాలని పెళ్లి చేసుకున్నామని, యువతి కుటుంబ సభ్యులు ఇలా చిత్రహింసలు పెడుతున్నారని యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆరు మంది మీద కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి పరారైన నలుగురి కోసం గాలిస్తున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications