సినిమాల్లో లీడ్ రోల్స్ లో నటించే చాన్స్, డ్యాన్స్ మాస్టర్ డిస్కోడ్యాన్స్, ధనుష్ స్కెచ్, లక్షల్లో ?

బెంగళూరు: సినిమా నటులు, దర్శకులు, డ్యాన్సర్లు కావాలని చాలా మంది కలలు కంటున్నారు. ఇక హీరోలు, హీరోయిన్లు కావాలని కలలుకనే వారి సంఖ్య ఏమాత్రం తక్కువ లేదు. పలు రాష్ట్రాల్లో యాక్టింగ్ స్కూల్స్ చాలానే ఉన్నాయి, యాక్టింగ్ స్కూల్స్ లో శిక్షణ పొందుతున్న వాళ్లు మాకు త్వరగా సినిమా చాన్స్ లు రావాలని ఆశపడుతుంటారు.

ఇలాంటి నిరుద్యోగ యువతి యువకులు, సినిమా పిచ్చి ఉన్న వాళ్లు, సినిమాల మీద మోజు ఉన్న వాళ్లను ఓ యువకుడు టార్గెట్ చేసుకున్నాడు. యాక్టింగ్ స్కూల్ లోనే ఉద్యోగం చేస్తున్న ఆ యువకుడు అమాయకులను నమ్మించి లక్షల రూపాయల డబ్బులు వసూలు చేశాడు. సినిమాల్లో లీడ్ రోట్ లో నటించడానికి తమకు వకాశం వస్తుందని అమాయకులు అతను అడిగింత డబ్బులు ఇచ్చేశారు.

 A dance master who is cheating to get a chance in movies has been arrested in Bengaluru.

బెంగళూరులో సినిమా నటీనటులు కావాలని ఆశపడుతున్న యువతి, యువకులకు ఓ యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ ఇస్తున్నారు. ఈ యాక్టింగ్ స్కూల్ కు ప్రముఖ నటి భవ్య ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు. ఈ యాక్టింగ్ స్కూల్ లో చాలా మంది యువతి, యువకులు శిక్షణ తీసుకుంటున్నారు.

ఇదే యాక్టింగ్ స్కూల్ లో డ్యాన్స్ మాస్టర్ గా, నటనలో శిక్షణ ఇచ్చే వ్యక్తిగా ధనుష్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ పొందుతున్న యువతి, యువకులకు సినిమాల్లో లీడ్ రోల్స్ లో నటించడానికి అవకాశం ఇప్పిస్తామని అందరిని నమ్మించారు. సుమారు 58 మంది దగ్గర దాదాపుగా రూ. 18 లక్షలకు పైగా డబ్బులు వసూలు చేసిన డ్యాన్స్ మాస్టర్ ధనుష్ ఆ డబ్బుతో జల్సాలు చేశాడు. బాధితులు మోసపోయామని గుర్తించి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకాలం తప్పించుకుని తిరుగుతున్న ధనుష్ శనివారం బెంగళూరు పోలీసులకు చిక్కిపోయాడు. ధనుష్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+