చెత్తబండి సిబ్బందికి వేడివేడి టీ: సోషల్ మీడియా ఫిదా
మన వీధిలో మున్సిపాలిటీ చెత్త బండి ఒక్క రోజు రాకపోతే చెత్త పేరుకుపోతుంది. కాలనీ మొత్తం కంపు కొడుతుంది. అలాంటి చెత్తబండిలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు రోజంతా పని చేస్తుంటారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్తను ఎత్తడం మొదలు.. దాన్ని డంపింగ్ యార్డ్ కు తీసుకెళ్లడం వరకు పనులన్నీ వాళ్లే చూసుకుంటుంటారు. ఎండ కాసినా, వానొచ్చినా, చలి పెడుతున్నా వాళ్ల పని మాత్రం ఆగదు. ఒక గంట చెత్త బండి ఆలస్యంగా వచ్చినా వాళ్లను తిట్టుకుంటుంటారు మనలో చాలామంది. అది వస్తోందంటే ముక్కు మూసుకుంటుంటారు.
10 డిగ్రీల చలిలో తెల్లవారు జామునే ఇళ్లల్లో చెత్తను తీసుకెళ్లడానికి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులకు ఓ మహిళ వేడివేడిగా టీ అందించారు. దగ్గరుండి టీ సర్వ్ చేశారు. ఆ మహిళ చేసిన చిన్నపని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె మంచి మనసు, పరోపకార స్వభావాన్ని నెటిజన్లు ప్రశంసిస్తోన్నారు. గుజరాత్ లోని బనస్కాంత జిల్లా పాలన్ పూర్ లో చోటు చేసుకున్న ఉదంతం ఇది.

జిమ్మీ అనే ఓ ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఉదయం 7:15 నిమిషాలకు చెత్తబండి ఆమె ఉండే వీధిలోకి వచ్చింది. చెత్త అందులో పారవేయడానికి ముందుగా ఆమె ఓ స్టీల్ చెంబులో అందులో ఉండే కార్మికుడికి, అనంతరం డ్రైవర్ కు టీ అందించారు. ఆ తర్వాతే చెత్తను అందులో వేశారు. ఆ మహిళ చెత్త వాహనం పక్కన నిల్చుని, అందులో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడికి, డ్రైవర్ కు టీ కప్పులు అందించడం ఈ వీడియోలో చూడొచ్చు.
एक माँ सुबह 7:15 बजे सफाई कर्मचारियों को चाय देने बाहर आती है। उनका यह छोटा-सा काम उन सफाई कर्मियों के दिन में गर्माहट भर देता है।
— JIMMY (@Jimmyy__02) December 12, 2025
यह हमें याद दिलाता है कि दयालुता के छोटे काम भी हमारे शहर के लिए मेहनत करने वाले लोगों के लिए बहुत मायने रखते हैं। pic.twitter.com/B30cqey4pm
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అయింది. అనేక మంది నెటిజన్లు మంచిమనసును ప్రశంసిస్తోన్నారు. ఆమెకు సెల్యూట్ చేస్తోన్నారు. పారిశుద్ధ్య కార్మికులను గౌరవించుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టేనని చెబుతున్నారు. తోటి మనిషిని మనిసిగా గుర్తించడంలోనే మానవత్వం దాగివుందని కీర్తిస్తోన్నారు. ఇటువంటి మరిన్ని మంచి పనులు చేసే అవకాశం ఆమెకు కల్పించాలని కోరుకుంటోన్నారు. ఇటువంటి అసలు సిసలు భారతదేశాన్నే ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని కామెంట్స్ పోస్ట్ చేస్తోన్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications