డబ్బులు ఇవ్వలేదని.. తల్లిని రాయితో కొట్టి చంపిన యువకుడు
తల్లిదండ్రులను పోషించాల్సిన యువకులు మత్తుకు బానిసై కన్నవారినే బలి తీసుకుంటున్నారు. పుట్టినప్పుడు కన్నఅనేక కళలను మొగ్గలోనే తుంచివేస్తున్నారు. తల్లిదండ్రుల పోషణను అటుంచి..తమకే తిరిగి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న యువత చివరికి వారి ప్రాణాలకే బలిగొంటున్నారు. తాజాగా తల్లిని డబ్బులకు వేధించి,ఇవ్వకపోతే ఇటుకతో మోది చంపిన దుర్మార్గమైన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది.

ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో దారుణం
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 65 సంవత్సరాల గౌరమ్మకు అక్కడి మండల పరిషత్ కార్యాలయానికి దగ్గరలో చాయ్ బండిపెట్టుకుని జీవిస్తోంది. కాగా గౌరమ్మకు ఇద్దరు కొడుకులు అందులో శ్రీను అనే చిన్నకోడుకు మద్యానికి బానిసయ్యాడు. కాగా దీంతో రోజు డబ్బులు కావాలని తల్లిని వేధించేవాడు.అయినా తల్లి కాబట్టి మౌనంగా భరిస్తూ వస్తుంది గౌరమ్మ ఇదే అదనుగా తీసుకున్న శ్రీను తాగుడుకు బానిసై గౌరమ్మను ఇబ్బందులకు గురిచేశాడు..

తాగుడుకు బానిసైన కొడుకు
అయితే శ్రీను తాగుడును మాన్పించేందుకు తల్లి గౌరమ్మ చాల సంవత్సరాలే ప్రయాత్నాలు చేసింది. అయినా శ్రీనులో ఎలాంటీ మార్పు రాలేదు. పైగా తాగుడుకు విపరీతంగా బానిసయ్యాడు. ఇక రోజులాగే సోమవారం నాడు మధ్యాహ్నం కూడ తల్లి దగ్గర డబ్బులు తీసుకునేందుకు వచ్చాడు. తల్లితో డబ్బులు ఇవ్వమని గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అయినా గౌరమ్మ డబ్బులు ఇవ్వలేదు.

బండరాయితో తల్లిని తలపై మోదిన కొడుకు
దీంతో డబ్బులు ఇవ్వకపోవడంతో శ్రీను కోపోద్రిక్తుడయ్యాడు. అక్కడే ఉన్న ఇటుక తీసుకున్న శ్రీను ఆమే తల్లి గౌరమ్మ తలపై బలంగా కొట్టాడు కోడుకు దాడి నుండి తప్పించుకునేందుకు గౌరమ్మ రోడ్డుపైకి వెళ్లింది. వెనక వస్తున్న కొడును చూసి పరుగులు పెట్టింది. పెద్ద వయస్సు కావడంతో పరుగెత్తే సమయంలో కిందపడిపోయింది. గౌరమ్మను వెంటాడిన శ్రీను తల్లి క్రింద పడిపోగానే ఆమే తల్లి అని కూడ చూడకుండా దాడి చేశాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియకుండా అక్కడ ఉన్న ఓ రాయితో ఆమే తలపై మోదాడు. దీంతో గౌరమ్మ దెబ్బలకు తాళలేక అక్కడిక్కడే ప్రాణాలు వదిలింది. తల పగిలి రక్తం కారింది.

రోడ్డుపై చంపుతున్న చూస్తున్న వైనం
ట్విస్ట్ ఏమిటంటే ఒక తాగుబోతు తల్లిని నడురోడ్డుపై బండరాయితో బాదుతుంటే అక్కడ ఉన్న స్థానికులు ఎవ్వరు ఆమేను రక్షించేందుకు రాలేకపోవడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ఇక హత్య సమాచారం అందుకున్న పోలీసులు హంతకుడు శ్రీను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల కస్టడీలో ఉన్న కిరాతకుడు చేసిన పాపాన్ని ఒప్పుకుని జైలుపాలయ్యాడు.












Click it and Unblock the Notifications