ఆస్తులు ఉన్నాయి కాని అమ్మాయి ఎక్కడ ?, ఏమిటి ఈ అగ్నిపరీక్ష అంటూ !
బెంగళూరు/హావేరి: సొంత పొలంలో ఓ యువకుడు వ్యవసాయం చేయిస్తున్నాడు. సొంత భూముల్లో కూలీలతో అతను వ్యవసాయం చేయిస్తున్నాడు. డబ్బులు బాగా సంపాధిస్తున్న యువకుడికి పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ అతనికి పెళ్లి చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే పెళ్లికూతురు మాత్రం చిక్కకపోవడంతో ఆ రైతు ఎవ్వరూ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు.. కర్ణాటకలోని హావేరి జిల్లాలోని బ్యాడగి తాలుకాలోని మాసణగి గ్రామంలో మంజునాథ్ రుద్రప్ప అలియాస్ మంజునాథ్ (36) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మంజునాథ్ కు మంచి ఆస్తులు ఉన్నాయి.

సొంత పొలంలో చాలా సంవత్సరాల నుంచి మంజునాథ్ వ్యవసాయం చేయిస్తున్నాడు. మంజునాథ్ కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది కూలీలు మంజునాథ్ పొలంలో వ్యవసాయం చేస్తున్నారు. సుమారు 10 ఏళ్ల నుంచి మంజునాథ్ కు పెళ్లి చెయ్యలని అతని కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మంజునాథ్ కూడా పెళ్లి చూపులకు వెళ్లి వస్తున్నాడు.
మంజునాథ్ కు అమ్మాయి నచ్చితే పెళ్లికూతురికి అతను నచ్చకపోవడం, కొన్ని సంబంధాలు ఆగిపోయాయి. అయితే మంజునాథ్, అమ్మాయికి ఇద్దరికి నచ్చిన కొన్ని సంబంధాలు నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోయాయి. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్న మంజునాథ్ హావేరి జిల్లాలోనే కాకుండా కర్ణాటకలోని అనేక జిల్లాల్లోని అమ్మాయిలను చూసి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.

అయితే ఎన్ని సంవత్సరాలు అయినా పెళ్లి కాలేదని స్నేహితుల దగ్గర మంజునాథ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈనెల 16వ తేదీన మంజునాథ్ అతని సొంత పొలంలో విషం తాగేశాడు. పక్క పొలం వాళ్లు విషయం గుర్తించి మంజునాథ్ ను బ్యాడగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంజునాథ్ పరిస్థితి విషమించడంతో తరువాత హుబ్బళిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఆ రోజు నుంచి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంజునాథ్ చికిత్స విఫలమై గురువారం రాత్రి చనిపోయాడని పోలీసులు అన్నారు. పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ పిల్లను ఇవ్వడం లేదని ఆవేదన చెందిన మంజునాథ్ జీవితంపై విరక్తి పెంచుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications