తీవ్ర విషాదం.. వర్షాలతో కుప్పకూలిన భవనం, 15మంది మృతి, కొనసాగుతున్న రెస్క్యూ!

మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని విరార్ ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది. నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలడంతో ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

మహారాష్ట్రలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం
ఈ ఘటనలో ఇంకా శిధిలాల కింద పలువురు చిక్కుకున్నారని సమాచారం. ఈ ఘటనలో భవన యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలు పాటించకుండా అక్రమ నిర్మాణం చేశారని ఫలితంగా ఇది కుప్పకూలింది అని మహారాష్ట్ర పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిన్న అర్ధరాత్రి నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

A four-stairs building collapsed due to rains in maharashtra palghar 15 people died resuce operation continues

15 మంది మృతి, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
మొత్తం 50 ఫ్లాట్లు ఉన్న రమాబాయి అపార్ట్మెంట్లో వెనుక భాగం కుప్పకూలి పోవడంతో ఘోర ప్రమాదం జరిగింది .ఇది పక్కనే ఉన్న మరో భవనం పైన పడింది. మొత్తం 12 నివాసాలు ఉన్న ఒక పక్క భాగం అంతా కూలిపోవడంతో 15 మంది మృతి చెందారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.

శిధిలాల క్రింద 20 నుండి 25మంది
ఈ ఘటనలో మరికొంతమంది శిథిలాల క్రింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 20 నుండి 25 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు గా భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ ఇది అక్రమ నిర్మాణంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, భవన యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు.

చిన్నారి తొలి పుట్టినరోజు వేడుకల్లో విషాదం
భవనం కూలిన సమయంలో నాలుగో అంతస్తులో ఓ చిన్నారి తొలి పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. చిన్నారి పుట్టినరోజు వేడుకలలో బంధువులంతా సంతోషంతో డాన్సులు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పేక మేడలా భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆ చిన్నారి తో పాటు తల్లిదండ్రులు అతిథులు శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే తల్లి బిడ్డ మరణించినట్టు పోలీసులు ధృవీకరించారు. తండ్రి జాడ ఇంకా తెలియలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+