Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వర్క్ ఫ్రమ్ హోమ్ పై కేంద్రం మరింత వెసలుబాటు

కార్మికుల హక్కులను మెరుగుపరచడానికి, వ్యాపార సౌలభ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు ప్రధాన కోడ్‌లుగా విలీనం చేసింది. ఈ నూతన సంస్కరణలు కోట్లాదిమంది కార్మికులకు పైగా కార్మికుల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనున్నాయి. ఈ నాలుగు కొత్త కార్మిక కోడ్‌లు - వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన భద్రతకు సంబంధించినవి. ఇవి మహిళలకు సమానత్వం, నిర్ణీత కాల ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఉచిత ఆరోగ్య పరీక్షలు వంటి అనేక కీలక నిబంధనలకు చెందినవి.

కోడ్ 1: వేతన కోడ్, 2019

  • వేతన చెల్లింపులు- 1936, కనీస వేతనాలు- 1948, బోనస్ చెల్లింపులు- 1965, సమాన వేతనం- 1976 చట్టాలను సరళీకృతం చేస్తుంది.
  • సార్వత్రిక కనీస వేతనాలు: సంఘటిత, అసంఘటిత రంగాలలోని కార్మికులందరికీ కనీస వేతనం చట్టబద్ధమైన హక్కుగా మారింది.
A Game Changer for Wages Safety and Social Security
  • ఫ్లోర్ వేజ్: కనీస జీవన ప్రమాణాల ఆధారంగా ప్రభుత్వం ఒక ఫ్లోర్ వేజ్‌ను నిర్ణయిస్తుంది. ఏ రాష్ట్రం కూడా దీని కంటే తక్కువ కనీస వేతనం ఇవ్వకూడదు.
  • వేతన ప్రమాణాలు: కార్మికుల నైపుణ్య స్థాయి, భౌగోళిక ప్రాంతాలు, ఉద్యోగ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వేతనాలను నిర్ణయిస్తారు.
  • లింగ సమానత్వం: నియామకం, వేతనాలు, లేదా ఉద్యోగ పరిస్థితులలో లింగ, లింగమార్పిడి ఆధారిత వివక్షను యజమానులు చూపకూడదు.
  • సార్వత్రిక కవరేజ్: వేతన పరిమితులతో సంబంధం లేకుండా, ఉద్యోగులందరికీ సకాలంలో చెల్లింపులు జరుగుతాయి. వేతనంలో అనధికార కోతలు ఇక చెల్లవు.
  • ఓవర్ టైమ్ పరిహారం: ఓవర్ టైమ్ పనికి నిర్దేశిత రెట్టింపు చెల్లించాలి.
  • వేతన చెల్లింపు బాధ్యత: యజమానులు ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి. లేకపోతే సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుంది.

కోడ్ 2: పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020

  • ట్రేడ్ యూనియన్లు- 1926, పారిశ్రామిక ఉపాధి (స్టాండింగ్ ఆర్డర్స్) చట్టం- 1946, పారిశ్రామిక వివాదాలు- 1947 నాటి చట్టాలు, వాటిలోని నిబంధనలను కలిపి రూపొందింది. ట్రేడ్ యూనియన్లు, ఉద్యోగ పరిస్థితులు, పారిశ్రామిక వివాదాల పరిష్కారానికి సంబంధించిన చట్టాలను సరళీకృతం చేయడమే దీని ఉద్దేశం
  • నిర్ణీత కాల ఉద్యోగం: ఒక సంవత్సరం తర్వాత గ్రాట్యుటీ అర్హతతో, సమాన వేతనాలు, ప్రయోజనాలతో నిర్ణీత కాల ఒప్పందాలకు ఈ కోడ్ అనుమతిస్తుంది.
  • వర్క్-ఫ్రమ్-హోమ్ నిబంధన: సేవా రంగాలలో పరస్పర అంగీకారంతో రిమోట్ పనికి అనుమతి ఉంది. పని చేసేసంస్థ యాజమాన్యం అనుమతితో ఎక్కడి నుంచైనా పని చేసే వెసలుబాటును కల్పించింది కేంద్రం. సర్వీస్ సెక్టార్ ను దీని పరిధిలోకి తీసుకొచ్చింది.
  • పారిశ్రామిక ట్రిబ్యునళ్లు: వివాదాల వేగవంతమైన పరిష్కారం కోసం న్యాయ, పరిపాలనా సభ్యులతో కూడిన రెండు సభ్యుల ట్రిబ్యునళ్లు.
  • సమ్మెలకు నోటీసు: చర్చలను ప్రోత్సహించడానికి, అంతరాయాలను తగ్గించడానికి అన్ని సంస్థలకు 14 రోజుల సమ్మె నోటీసు తప్పనిసరి. ఆకస్మిక సమ్మెలను నిరోధించడానికి సామూహిక ఆకస్మిక సెలవు కూడా సమ్మె పరిధిలోకి వస్తుంది.

కాంగ్రెస్ విమర్శలు.. 5 ప్రధాన డిమాండ్లు..

ప్రస్తుతం ఉన్న 29 కార్మిక చట్టాలను నాలుగు కొత్త కోడ్‌లుగా మార్చడాన్ని కాంగ్రెస్ తప్పు పట్టింది. వీటి రూల్స్ ఇంకా నోటిఫై చేయలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ విమర్శించారు. కార్మికుల 'శ్రామిక్ న్యాయ్'కు సంబంధించిన అయిదు ముఖ్యమైన డిమాండ్లను ఈ కొత్త కోడ్‌లు నెరవేరుస్తాయా అని రమేష్ ప్రశ్నించారు.

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోజుకు 400 రూపాయల జాతీయ కనీస వేతనం అందించాలని డిమాండ్ చేశారు. 25 లక్షల వరకు సార్వత్రిక ఆరోగ్య కవరేజీని అందించే ఆరోగ్య హక్కు చట్టాన్ని తీసుకురావాలని, పట్టణ ప్రాంతాల కోసం ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసంఘటిత కార్మికులందరికీ సమగ్ర సామాజిక భద్రత కల్పించాలని, ఇందులో జీవిత బీమా, ప్రమాద బీమా కూడా ఉండాలని అన్నారు.

ప్రభుత్వ కీలక రంగాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలను ఆపడానికి కట్టుబడి ఉండాలని సూచించారు. 21వ శతాబ్దానికి అనుగుణంగా కార్మిక సంస్కరణలు తీసుకురావడంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం, రాజస్థాన్‌లోని గత ప్రభుత్వం ఆదర్శంగా నిలిచాయని జైరామ్ రమేష్ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చిన విప్లవాత్మక గిగ్ వర్కర్ చట్టాలు కొత్త కోడ్‌లకు మార్గదర్శకంగా ఉన్నాయని, మోదీ ప్రభుత్వం వీటి నుండి నేర్చుకోవాలని సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+