డేటింగ్ యాప్, న్యూడ్ వీడియో కాల్స్, కాలేజ్ స్టూడెంట్స్ టార్గెట్, కిలాడీ గ్యాంగ్ !
బెంగళూరు: కాలేజ్ లో చదువుతున్న అబ్బాయి ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్నాడు. క్రమం తప్పకుండా కాలేజ్ కు వెళ్లి వస్తున్న యువకుడు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్నాడు. సోషల్ మీడియాలో కాలం గడుపుతున్న ఆ యువకుడు డేటింగ్ యాప్ డౌన్ లోడ్ చేశాడు. తరువాత ఆ కాలేజ్ యువకుడు నగ్నంగా వీడియో కాల్స్ లో మాట్లాడటం మొదలు పెట్టడంతో తరువాత అసలు సినిమా కథ మొదలైయ్యింది.
చెన్నై సిటీలోని కీల్పాక్కం ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువకుడు చెన్నైలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో చదువుతున్నాడు. సోషల్ మీడియాలో కాలం గడుపుతున్న ఆ యువకుడు కొన్ని డేటింగ్ యాప్ప్ పరిశీలించాడు. కొంతకాలం క్రితం ఆ కాలేజ్ అబ్బాయి డేటింగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసి అందులోని కొన్ని వివరాలు సేకరించాడు.

తరువాత కొందరితో నగ్నంగా వీడియో కాల్స్ లో మాట్లాడిన ఆ కాలేజ్ యువకుడు ఆనందించాడు. ఇలా నగ్నంగా వీడియో కాల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న కాలేజ్ అబ్బాయికి ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. నువ్వు రహస్య ప్రాంతానికి వస్తే అక్కడ మనం ఎంజాయ్ చేద్దామని, అక్కడ ఎవ్వరూ ఉండరని అవతలి వ్యక్తి కాలేజ్ అబ్బాయిని రెచ్చగొట్టడంతో అతను తట్టుకోలేకపోయాడు.
అంతే అవతలి వ్యక్తి చెప్పిన చోటకు ఎగేసుకుంటూ వెళ్లిన కాలేజ్ అబ్బాయి ఎదురుగా నలుగురిని చూసి షాక్ అయ్యాడు. అక్కడ ఇద్దరు ప్రత్యక్షం అయ్యి కాలేజ్ అబ్బాయిని చితకబాది అతని దగ్గర ఉన్న విలువైన మొబైల్ ఫోన్, రూ. 15 వేలు నగదు లాక్కొన్నారు. ఈ విషయం గురించి నువ్వు పోలీసులకు ఫిర్యాదు చేస్తే నీ నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, తరువాత నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని నిందితులు కాలేజ్ అబ్బాయిని బెదిరించారు.
అయితే తరువాత కూడా నిందితులు పదేపదే కాలేజ్ అబ్బాయికి ఫోన్లు చేసి బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టారు. నిందితుల టార్చర్ తట్టుకోలేని కాలేజ్ అబ్బాయి చెన్నైలోని చులైమేడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారణ చేశారు. తమిళనాడులోని మదురైకి చెందిన దేవేంద్రన్, తేని జిల్లాకు చెందిన రాజ్ కుమార్ అనే నిందితులను అరెస్టు చేశామని, రమేష్, కార్తీక్ అనే ఇద్దరు నిందితులు పరారైనారని పోలీసులు తెలిపారు.
డేటింగ్ యాప్ లో నకిలి ఐడీలు క్రియేట్ చేసి కాలేజ్ అబ్బాయిలు, అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేస్తున్న నిందితులు ఇలా అక్రమంగా డబ్బులు సంపాధిస్తున్నారని, వీళ్లు ఇంకా ఎంతమందిని ఇలా మోసం చేశారు, నగ్న వీడియోలు సోషల్ మీడియాలో ఏమైనా పోస్టు చేశారా అని ఆరా తీస్తున్నామని చెన్నై సిటీ పోలీసు అధికారులు తెలిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications