ఆఫీసులో ఆంటీతో?, భార్యకు విషం ఇంజెక్షన్ ఇచ్చిన భర్త, లాస్ట్ ఫోన్ కాల్ లో మ్యాటర్ లీక్!

వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా ఉన్నారని మహిళ కుటుంబ సభ్యులు సంబరపడిపోయారు. ఐటీ హబ్ లో మంచి ఉద్యోగం చేస్తున్న భర్త అతని భార్యను సంతోషంగా చూసుకునేవాడు అయితే ఉద్యోగం చేస్తున్న చోట వివాహిత మహిళతో అక్రమ సంబందం పెట్టుకున్న భర్త అతని భార్యను పట్టించుకోవడం మానేశాడు. చివరికి భర్త అతని భార్యకు విషం ఇంజెక్షన్ ఇచ్చి హత్య చెయ్యడం కలకలం రేపింది.

ఇంట్లో ఉన్న గృహిణి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన కర్ణాటకలోని చిక్కమగళూరులోని ముదిగెరెలో చోటుచేసుకుంది. భర్త అతని భార్యకు విషం ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశాడని గృహిణి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. గోనిబీడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మృతి చెందిన మహిళను శ్వేతా (31) అని పోలీసులు తెలిపారు. ముదిగెరె తాలూకా దేవవృంద గ్రామంలోని ఇంట్లో శ్వేతా అనుమానాస్పదంగా శవమై కనిపించింది.

A husband who had an affair with a colleague killed his wife by injecting her with poison in Karnataka

బెంగళూరుకు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ దర్శన్ కు, శ్వేతా అనే మహిళకు కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. శ్వేతా ఆమె భర్త దర్శన్‌తో కలిసి బెంగళూరులో నివసించేది. ల్యాబ్ టెక్నీషియన్ అయిన దర్శన్ అతని భార్యతో కలిసి నాలుగు రోజుల క్రితం ముదిగెరెకి వెళ్లాడు. శ్వేతా ఇంట్లోనే చనిపోయిందని ఆమె భర్త దర్శన్ అత్తకు ఫోన్ చేసి చెప్పాడు. తరువాత దర్శన్ కుటుంబ సభ్యులు హడావుడిగా శ్వేతా అంత్యక్రియలు చెయ్యడానికి సిద్ధమైనారని శ్వేతా కుటుంబ సభ్యులు ఆరోపించారు.

శ్వేతా గుండెపోటుతో మృతి చెందినట్లు అల్లుడు దర్శన్ మా కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడని శ్వేతా బంధువులు అంటున్నారు. శ్వేతా దహన సంస్కారాలు సిద్ధం చేశారు. అయతే శ్వేతా కుటుంబీకులు మాత్రం ఆమె మృతదేహాన్ని వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శ్వేతాకు విషం ఇంజక్షన్ వేసి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. శ్వేతా చేతిపై ఇంజక్షన్ గుర్తు కూడా కనిపించింది.

A husband who had an affair with a colleague killed his wife by injecting her with poison in Karnataka

దర్శన్, శ్వేతాను మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడని, పెళ్లి అయినప్పటి నుంచి దర్శన్ టార్చర్ పెడుతున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. దర్శన్‌కు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని కొంతకాలం క్రితం శ్వేతా ఆమె కుటుంబ సభ్యుల ముందు చెప్పింది. అక్రమ సంబంధానికి సంబంధానికి అడ్డుగా ఉందని భార్య శ్వేతాకు విషం ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశాడని శ్వేతా కుటుంబ సభ్యులు ఆరోపించారు.

గోనిబీడు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. శ్వేతా చనిపోయే ముందు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారింది. భర్త దర్శన్ అతని సహోద్యోగిని ప్రేమిస్తున్నాడని, ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, శ్వేతా మాట్లాడిన ఆడియో పోలీసులకు చిక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+