wife: సరదాలు, సరసాల పెళ్లామ్, భార్య శవాన్ని ఇంట్లో పెట్టుకుని ఉద్యోగానికి వెళ్లిన భర్త, మ్యాటర్ అంతే !
సరదాలు, తిరుగుళ్లకు అలవాటుపడిన భార్య మీద భర్తకు అనుమానం పెరిగిపోయింది. భర్త దెబ్బతో మ్యాటర్ మొత్తం రివర్స్ రావడంతో సాయంత్రం అసలు కథ మొదలైయ్యింది.
ముంబాయి/పాల్గార్: యువతి, యువకుడి పెళ్లి పెద్దలు సెట్ చేశారు. పెళ్లి చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న భర్త ఎక్కువగా బయట ఉంటున్నాడు. ఉదయం ఇంటి నుంచి బయటకు వెలుతున్న భర్త రాత్రి ఎప్పుడుపడితే అప్పుడు ఇంటికి వెలుతున్నాడు. సరదాలు, తిరుగుళ్లకు అలవాటుపడిన భార్య మీద భర్తకు అనుమానం పెరిగిపోయింది. భర్త దెబ్బతో మ్యాటర్ మొత్తం రివర్స్ రావడంతో సాయంత్రం అసలు కథ మొదలైయ్యింది.

7 ఏళ్ల క్రితం హ్యాపీగా పెళ్లి
మహారాష్ట్రాలోని పాల్గార్ జిల్లాలోని నలసోపరా ప్రాంతంలో ప్రభు విశ్వకర్మ అలియాస్ ప్రభు (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఏడు సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన అనితా అనే యువతిని ప్రభు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత ప్రభు అతని భార్య అనితాతో సంతోషంగా కాపురం చేశారు. భార్య అనితా ఎక్కడికి వెళ్లాలని చెప్పినా ప్రభు ఆమెను బయటకు పిలుచుకుని వెలుతున్నాడు.

భార్య మీద అనుమానం వచ్చింది
ప్రభు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉదయం ఇంటి నుంచి బయటకు వెలుతున్న ప్రభు రాత్రి ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వెలుతున్నాడు. ప్రభు భార్య మాత్రం ఇంటిలోనే ఉండేది. అయితే ప్రభు ఉద్యోగానికి వెళ్లిన తరువాత అతని భార్య అనితా నీట్ గా రెడీ అయ్యి బయటకు వెళ్లి భర్త ఇంటికి వచ్చే ముందే ఆమె కూడా ఇంటికి చేరుకుంటున్నదని తెలిసింది.

నా భార్యకు అక్రమ సంబంధం
కొంతకాలం క్రితం తన భార్య అనితా ఇంటి నుంచి బయటకు వెళ్లి పగలు మొత్తం బయటతిరిగి తరువాత సాయంత్రం ఇంటికి వస్తోందని ప్రభుకు తెలిసింది. ఇదే విషయంలో ప్రభు, అనితా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గొడవలు జరుగుతున్నా అనితా మాత్రం ఇంటి నుంచి బయటకు వెలుతోందని తెలిసింది. భార్య అనితా తీరుతో విసిగిపోయిన ప్రభు ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు.

శవాన్ని ఇంట్లో పెట్టి ఉద్యోగానికి వెళ్లిన భర్త
రాత్రి ఇదే వియంలో ప్రభు, అనితా దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన ప్రభు వేల్ తీసుకుని అతని భార్య అనితా గొంతు నులిమి చంపేశాడు. రాత్రి భార్య శవం పక్కనే ఉన్న ప్రభు ఉదయం స్నానం చేసి నీట్ గా పనికి వెళ్లాడు. సాయంత్రం వరకు పని చేసిన ప్రభు తరువాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా భార్య అనితాను రాత్రి చంపేశానని, ఇంట్లో శవం ఉందని, మీరే వెళ్లి శవం తెచ్చుకోవాలని పోలీసులకు చెప్పడంతో పోలీసులు బిత్దరపోయారు.

ఏమాత్రం ఫీలింగ్ లేదు
అనితా శవాన్ని పోస్టుమార్టంకు పంపించిన పోలీసులు ప్రభును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు, తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ తనను మోసం చేస్తోందని, అందకే చంపేశానని ప్రభు నేరం అంగీకరించాడని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు. అయితే భార్య అనితాను చంపేశానని ప్రభు ముఖంలో ఏమాత్రం ఫీలింగ్ లేదని పోలీసులు అంటున్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications