మద్యం మత్తులో యువతిపై స్నేహితుడి ముందే లైంగికదాడి

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు:స్నేహితుడి ముందే ఓ యువతిపై లైంగిక దాడులకు పాల్పడ్డారు నలుగురు యువకులు. ఎలాగోలా నిందితుల బారి నుండి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది.

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో స్నేహితుడితో కలిసి ఓ యువతి బైక్ పై వెళ్తోంది.అయితే అదే దారిలో మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు బైక్ లపై ఎదురుగా వచ్చారు.

a lady sexual harassment in front of friend.

మద్యం మత్తులో ఉన్న యువకులు స్నేహితుడితో కలిసి బైక్ పై వెళ్తోన్న యువతి బైక్ కు అడ్డంగా తమ బైక్ లను పెట్టారు.

యువతి వాహనం తాళం చెవి లాక్కొన్నారు.ఎందుకు వావాహనాలు అడ్డుపెట్టారని ప్రశ్నించినందుకు ఆమెను వేధించారు. ఆమె దుస్తులు లాగారు.

అయితే ఇదంతగా పక్కనే దుకాణాల వద్ద ఉన్నవారంతా గమనించారు.నలుగురు యువకులు ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని వేడుకగా చూశారు.కనీసం ఎవరూ కూడ వారించలేదు.

యువతి స్నేహితుడు యువకుల వద్ద ఉన్న బైక్ తాళం చెవి లాక్కొన్నారు.అయితే యువతి తన సెల్ ఫోన్ లో తనను వేధించిన నలుగురు యువకుల ఫోటోలను తీసింది. నేరుగా స్నేహితుడితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేసింది.యువతి తన సెల్ ఫోన్ లో తీసిన ఫోటోల ఆధారంగా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
a lady sexual harassment in front of friend in bangalore on sunday.
Please Wait while comments are loading...