బుర్కా వేసుకుని ఆసుపత్రిలో మగాళ్లతో రొమాన్స్ చేస్తు స్పెషల్ లేడీ డాక్టర్ !

నాగ్ పూర్/న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆసుపత్రిలో బుర్కా వేసుకున్న లేడీ డాక్టర్ హంగామా చేస్తోంది. మగాళ్ల మీద ఎక్కువ శ్రద్ద చూపిస్తున్న ఆ స్పెషల్ లేడీ డాక్టర్ వాళ్లను ప్రత్యేక గదుల్లోకి పిలుచుకుని వెళ్లి ఎక్కువ సమయం గడిపింది. మహిళా డాక్టర్ వేషం వేసి ఆస్పత్రిలోని మగ రోగులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న ఆ స్పెషల్ లేడీ డాక్టర్‌ను ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటన నాగ్‌పూర్‌లోని ఇందిరాగాంధీ ప్రభుత్వ వైద్య కళాశాలలో చోటుచేసుకుంది. అరెస్టయిన వ్యక్తిని జావేద్ షేక్ (25)గా గుర్తించారు. నాగ్ పూర్ లోని తాజ్‌బాగ్ లో నివాసం ఉంటున్న జావేద్ స్వలింగ సంపర్కుడిగా గుర్తించామని పోలీసులు అన్నారు.

 romancing

బుర్కా ధరించి మహిళా వైద్యురాలి వేషంలో ఆసుపత్రి ఆవరణలో అనుమానాస్పదంగా నడుచుకుంటూ వస్తున్న జావేద్ ను చూసి ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులు అతడిని పట్టుకున్నారు. తరువాత బుర్కాతో పాటు అతని ఆడ వేషం తీసి పోలీసులకు అప్పగించారు.

పోలీసు విచారణలో, నిందితుడు లింగమార్పిడి అయినందున పురుషులతో స్నేహం చేయడానికి మహిళా డాక్టర్ వేషంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినట్లు వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సాగర్ పాండే మీడియాతో మాట్లాడుతూ మా ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులు ఇంతకుముందెన్నడూ ఇలాంటి వైద్యులను చూడలేదని, మా ఆసుపత్రిలో పని చేసే ముస్లీం మహిళా డాక్టర్లు కేవలం హిజాబ్ ధరించి ఉంటారని, ఎవ్వరూ బుర్కాలు వేసుకోరని అన్నారు.

మా ఆసుపత్రి మహిళా డాక్టర్లు తలని మాత్రమే హిజాబ్ తో కప్పుకుని రోగులకు చికిత్స అందిస్తారని, లేడీ డాక్టర్లు అందరూ వాళ్ల ముఖాలు చూపిస్తారని డాక్టర్ సాగర్ పాండే అన్నారు. కానీ జావేద్ అతని శరీరమంతా బుర్కాతో కప్పుకున్నాడని, దీంతో భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చిందని, అందుకే అతడిని పిలిచి బుర్కా తియ్యమని చెబితే మొదట మెండికివేశాడని, తరువాత బలవంతంగా బుర్కా తొలగిస్తే అసలు విషయం బయటపడిందని డాక్టర్ సాగర్ పాండే వివరించారు.

అనంతరం పోలీసులు అతడిని విచారించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. జావేద్ గత 20 రోజులుగా ఈ ఆసుపత్రికి నిరంతరం వస్తున్నాడని, బుర్కా వేసుకుని మహిళా వైద్యులు ధరించే ఆప్రాన్ ధరించాడని. అనంతరం అక్కడి వైద్యులు, సిబ్బందికి తాను వైద్యురాలు అయేషా సిద్ధిఖీ అని పరిచయం చేసుకున్నాడని పోలీసులు అన్నారు. జావేద్ మగ రోగులపై ఎక్కువ దృష్టి పెట్టాడని, అలాగే అక్కడున్న ఇతర వైద్యులతో కూడా గొంతు మార్చి మాట్లాడేవాడు, కాబట్టి ఇన్ని రోజులు ఎవరికీ అనుమానం రాలేదనిదని పోలీసులు చెప్పారు.

 romancing

అయితే గత నాలుగు రోజులుగా అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డు సంతోషి జావేద్ ప్రవర్తన వింతగా ఉందని భావించి అనుమానం వచ్చింది. అందుకే ఉదయం జావేద్ బురఖా ధరించి ఆసుపత్రికి వస్తుండగా సంతోషి అతడిని కలుసుకుని పలు ప్రశ్నలు వేసి బురఖా తొలగించాలని కోరింది. అయితే తన సహోద్యోగుల ముందు బుర్కా తీసేస్తే చిక్కిపోతామని బుర్కా తీసేయడానికి నిరాకరించాడు.

సంతోషి అతనిని ఒక ప్రత్యేక గదికి తీసుకెళ్ళి అతని బుర్కా తీసివేయమని ఆదేశిస్తాడు. ఈసారి ఆమె షాక్‌కు గురై బుర్కాలో మహిళకు బదులుగా జావేద్ ఉన్నట్లు గుర్తించారు. సంతోషి వెంటనే ఆసుపత్రి భద్రతా విభాగానికి సమాచారం అందించింది, వారు ఫోన్‌లో పోలీసులకు కాల్ చేశారు. జావేద్ షేక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+