భర్తకు విడాకులు, అపార్ట్ మెంట్ లో ప్రియుడు, ఆఫీసులో బాయ్ ఫ్రెండ్, లేడీ మేకప్ ఆర్టిస్ట్ స్టోరి !

ఓ మహిళ వివాహం చేసుకుని ఆమె భర్తతో కాపురం చెయ్యడంతో బిడ్డపుట్టాడు. బిడ్డపుట్టిన తరువాత భార్య భాగోతం తెలుసుకున్న భర్త ఆమెతో నిత్యం గొడవలు పడేవాడు. దంపతుల మధ్య గొడవలు ఎక్కువ కావడంతో భర్తకు గుడ్ బై చెప్పిన భార్య వేరే వ్యక్తితో పరిచయం పెంచుకుని అతనితో సహజీవనం సాగిస్తోంది. ఇదే సమయంలో సహజీవనం చేస్తున్న వ్యక్తి కాకుండా మూడో ప్రియుడు ఆమె జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు.

తరువాత కథ రసవత్తరంగా మారిపోయింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న వ్యక్తిని ఓ మహిళ కత్తితో పలుచోట్ల పొడిచి దారుణంగా చంపిన ఘటన పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో చోటుచేసుకుంది.సార్థక్ దాస్‌ అలియాస్ దాస్ (36) అనే వ్యక్తి హత్యకు గురైనాడని పోలీసు అధికారులు తెలిపారు. సార్థక్ దాస్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు. నిందితురాలు సంహతి పాల్ అలిమాస్ పాల్ (33) తో సార్థక్ దాస్ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

A makeup artist who brutally murdered her co-habiting boyfriend by stabbing her multiple times

హంతకురాలు సంహతి పాల్‌ కూడా ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. సంహతి పాల్ కు గతంలో వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. సంహతి పాల్ కు కుమారుడు చాలా చిన్నవాడని పోలీసులు అన్నారు. అయితే భార్య సంహతి పాల్ తీరుతో విసిగిపోయిన భర్త ఆమెకు దూరం కావాలని అనుకున్నాడు. అదే సమయంలో భర్తను వదిలేసిన సంహతి పాల్ ఆమె కుమారుడితో కలిసి వేరుగా నివాసం ఉండటం మొదలుపెట్టింది.

భర్త నుంచి విడాకులు తీసుకుని విడిగా జీవిస్తున్న సంహతి పాల్ కు సార్థక్ దాస్ కు రెండు సంవత్సరాల క్రితం పరిచయం అయ్యింది. భర్తను వదిలేసిన సంహతి పాల్ ఒంటరిగా ఉంటున్న సంగతి సార్థక్ దాస్ కు తెలిసింది. తరువాత కోల్ కత్తాలోని డమ్ డమ్ ప్రాంతంలోని విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో సార్థక్ దాస్, సంహతి పాల్ సహజీవనం చెయ్యడం మొదలుపెట్టారు. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు. సంహతి దాస్ ఆమె కొడుకును అదే ఇంటిలో పెట్టుకుంది.

A makeup artist who brutally murdered her co-habiting boyfriend by stabbing her multiple times

కొన్ని నెలల క్రితం సంహతి పాల్ మరో యువకుడితో చనువుపెంచుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంలో సార్థక్ దాస్, సంహతి పాల్ ల మధ్య గొడవలు మొదలైనాయని తెలిసింది. తనతో ఎంజాయ్ చేస్తున్న సార్థక్ ఇప్పుడు తన సంతోషానికి అడ్డుపడుతున్నాడని, అతన్ని చంపేయాలని సంహతి డిసైడ్ అయ్యిందని తెలిసింది. సహజీవనం చేస్తున్న ప్రియుడు సార్థక్ హత్యకు సంహతి పాల్ పక్కాప్లాన్ చేసింది.

సంహతి పాల్‌ను ఆమె సహజీవనం చేస్తున్న భాగస్వామి సార్థక్ ను హత్య చేయడానికి ముందు సార్థక్ దాస్ తో పాటు మొదటి భర్తకు పుట్టిన కుమారుడితో కలిసి తీసుకున్న కొన్ని ఫోటోలను అతని సోషల్ మీడియా ఖాతాలో బెటర్ హాఫ్, లవ్ ఆఫ్ మై లైఫ్ పేరుతో సంహతి స్వయంగా పోస్టు చేసింది. ఇదే సమయంలో సార్థక్ దాస్, ఆమె కొడుకు ఫోటోలను సంహతి పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ పెట్టిన కొన్ని గంటల్లోనే సార్థక్ దాస్ హత్యకు గురయ్యాడు.

A makeup artist who brutally murdered her co-habiting boyfriend by stabbing her multiple times

36 ఏళ్ల వయస్సులో ఉన్న సార్థక్ దాస్, సంహతి పాల్ గత కొన్ని రోజులుగా వారి అక్రమ సంబంధం విషయంలో గొడవలు పడుతున్నారని తెలిసింది. ఇలా తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. తన లివ్ ఇన్ పార్ట్‌నర్ సార్థక్ దాస్‌ను హత్య చేసిన తర్వాత ఆమె స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి తన ప్రియుడిని చంపేశానని సమాచారం ఇచ్చింది. సంహతి పాల్ నుండి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న పోలీసు బృందం డమ్‌డమ్ ప్రాంతంలోని సంహతి పాల్ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు చేరుకుని ఆమెను విచారణ చేశారు.

ప్రియుడు సార్థక్ దాస్ శరీరంపై పలుచోట్ల కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని పోలీసులు గమనించారు. అనంతరం సార్థక్ దాస్‌ను పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు చెప్పారు. విచారణలో తన ప్రియుడు సార్థక్ దాస్ ను తానే హత్య చేశానని సంహతి పాల్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రియుడు సార్థక్ దాస్ ను అంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చెయ్యడానికి దారితీసిన అసలు మ్యాటర్ ఇంకా తెలియరాలేదని పోలీసు అధికారులు అంటున్నారు. హత్యా నేరం కింద సంహతి పాట్ ను అరెస్టు చేశామని కోల్ కత్తా పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+