వీడియో: తల్లి పొత్తిళ్లలో నిద్రిస్తున్న చిన్నారిని అపహరించే యత్నం.. చివరి నిమిషంలో!

Recommended Video

    తల్లి పొత్తిళ్లలో నిద్రిస్తున్న చిన్నారిని అపహరించే యత్నం(వీడియో)

    చండీగఢ్: తల్లి పొత్తిళ్లలో హాయిగా, ఆదమరిచి నిద్రిస్తున్న ఓ నాలుగేళ్ల చిన్నారిని అపహరించడానికి ప్రయత్నించాడో దుర్మార్గుడు. చివరి నిమిషంలో తల్లి మేల్కొనడంతో ఆ దుండగుడి కథ అడ్డం తిరిగింది. బిడ్డను అక్కడే వదిలేసి పారిపోయాడు. లేకుంటే- ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉండేదనే ఆలోచనే భయం గొలుపుతోంది. ఈ అపహరణ ప్రయత్నం మొత్తం సీసీటీవీ కెమెరాలో నమోదైంది. దీని ఫుటేజీ ఆధారంగా అతగాడిని పోలీసులు అరెస్టు చేశారు.

    పంజాబ్ లోని లూధియానాలో ఈ ఘటన చోటు చేసుకుంది. లూధియానాలోని రిషి నగర్ లో ఏరియాలో భార్యాభర్తలు నివసిస్తున్నారు. వారికి ఓ కుమర్తె ఉంది. మంగళవారం రాత్రి వారు ఇంటి బయట మంచం వేసుకుని నిద్రించారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటి గంట 14 నిమిషాల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రిక్షాను నడిపించుకుంటూ ఆ వీధిలోకి వచ్చాడు.

     A man attempts to steal a 4-year-old child while she was sleeping with her family members in punjab

    అతని కన్ను తల్లి ఒడిలో వెచ్చగా పడుకున్న చిన్నారిపై పడింది. అంతే- చడీ చప్పుడు కాకుండా.. ఆ చిన్నారిని ఎత్తుకుని రిక్షాలో పెట్టాడు. అదే సమయంలో ఆ పాప గట్టిగా ఏడవడంతో ఉలిక్కిపడి నిద్ర లేచిన తల్లి అతణ్ని అడ్డుకుంది. గట్టిగా కేకలు వేస్తూ రిక్షాలో ఉంచిన పాపను తన చేతుల్లోకి తీసుకుంది. కథ అడ్డం తిరగడంతో ఆ కిరాతకుడు అక్కడి నుంచి రిక్షాతో సహా పారిపోయాడు. దీనిపై ఆ పాప తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం.. దుండగుడిని గుర్తించారు. కటకటాల వెనక్కి నెట్టేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+