Viral Video: రోడ్డుపై నోట్లు.. పట్టుకున్నోళ్లకు పట్టుకున్నంతా.. వీడియో వైరల్

డబ్బులంటే ఎవరికి ఇష్టముండదు.. అందరికి ఇష్టమే.. కానీ డబ్బును సంపాదించాలంటే చాలా కష్టపడాలి. అప్పుడు పైసాలు సంపాదించవచ్చు. అలా కాకుండా రోడ్డుపై వెళ్తుండగా డబ్బు దొరికితే ఎలా ఉంటుంది. ఏ ముంది చేతికి ఎంత డబ్బు వస్తే అంత తీసుకోవడమే.. మరి ఇది నిజంగా జరుగుతుందా అంటే.. అవును జరుగుతుంది.. జరిగింది కూడా..

రోడ్డుపై నోట్లు గాల్లో తేలే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బెంగళూరులో ఓ వ్యక్తి సూట్ వేసుకుని ఫ్లై ఓవర్ పైకి వచ్చాడు. బ్యాగ్ లో ఉన్న డబ్బును ఫ్లైఓవర్ పై నుంచి కిందికి వెదజల్లాడు. దీంతో కింద ఉన్నవారంతా డబ్బు కోసం ఉరుకులు పరుగులు పెట్టారు. చేతికి ఎంత దొరికితే అంత పట్టుకుని వెళ్లిపోయారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది.

A man dropped notes on the road in Bengaluru causing a massive traffic jam

అయితే అతను రోడ్డుపై నోట్లు ఎందుకు చల్లాడో తెలియదు. చల్లిన వెంటనే పారిపోయాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అయితే ఆ యువకుడికి మతిస్తిమితం లేదని తేలింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను రకేష్ ప్రకాశ్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. వీడియోతో పాటు #సిర్సి సర్కిల్ ఫ్లైఓవర్, దాని క్రింద ఉన్న రహదారి (KRMarket)పై ఒక యువకుడు మంచి దుస్తులు ధరించి కరెన్సీ నోట్లను విసిరేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అతనెవరో, ఎందుకు చేశాడో తెలియరాలేదు. అని రాసుకొచ్చారు.ఈ వీడియోకు ఇప్పటి వరకు 20 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. సరే కానీ అవి ఎన్ని రూపాయల నోట్లో చెప్పాలని ఒకరు కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+