ఆరు మంది ఫ్రెండ్స్ తో కలిసి ప్రియురాలిపై గ్యాంగ్ రేప్: ప్రేమ ముసుగులో!

బెంగళూరు: ప్రేమిస్తున్నానని నమ్మించి బాలిక మీద అమె ప్రియుడే గ్యాంగ్ రేప్ చేయించిన దారుణ ఘటన కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన ధర్మస్థల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలిని మంగళూరు ఆసుపత్రికి తీసుకు వెళ్లిన సమయంలో ఆలస్యంగా విషయం వెలుగు చూసింది.

ధర్మస్థలం సమీపంలో 17 ఏళ్ల బాలిక నివాసం ఉంటున్నది. ఈమెను ఓ యువకుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమ ముసుగులో ఎనిమిది నెలల క్రితం బాలికను నమ్మించి బయటకు తీసుకెళ్లాడు. తరువాత తన ఆరు మంది స్నేహితులతో కలిసి ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు.

A minor girl rapped by her lover and six other who were his friends in Mangalore few months back.

ప్రియుడే దగ్గరుండి ప్రియురాలి మీద అత్యాచారం చేయించి విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. బాలిక బయపడి విషయం బయటకు చెప్పలేదు. అయితే రెండు రోజుల క్రితం బాలిక అస్వస్థతకు గురై కుప్పకూలిపోయింది.

కుటుంబ సభ్యులు బాలికను మంగళూరు ఆసుపత్రికి తరలించారు. బాలిక ఏడు నెలల గర్బవతి అని అక్కడి వైద్యులు చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు. తన ప్రియుడే అతని ఆరు మంది స్నేహితులతో కలిసి తన మీద సామూహిక అత్యాచారం చేశారని బాలిక ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+