Wife: నా భార్య రోజూ ఫ్రెష్ గా స్నానం చెయ్యడంలేదు, బ్యాడ్ గర్ల్, తలాక్ చెప్పిన భర్త, భార్య రివర్స్ కేసు !
లక్నో/చెన్నై: రెండు సంవత్సరాల క్రితం యువతితో సంతోషంగా వివాహం చేసుకున్న యువకుడు ఓ పాపకు తండ్రి అయ్యాడు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. దంపతుల కుటుంబ సభ్యులు, బంధువులు సంవత్సరం నుంచి ఇద్దరి మద్య పంచాయితీలు చేసి రాజీ చెయ్యడానికి ప్రయత్నించారు. దంపతుల మద్య రాజీ కదురకపోవడంతో పెద్దలు చేతులు ఎత్తేశారు. నా భార్య నేను చెప్పినట్లు వినడం లేదని ఆరోపిస్తూ భర్త మూడుసార్లు తలాక్ చెప్పేసి విడాకులు ఇచ్చేశాడు. నా భర్త తనకు అనవసరంగా విడాకులు ఇచ్చాడని ఆరోపిస్తూ భార్య పోలీసులను ఆశ్రయించింది. దంపతుల మద్య ఏం జరిగింది ? అని తెలుసుకున్న పోలీసులు అసలు మ్యాటర్ తెలుసుకుని షాక్ అయ్యారు. నా భార్య రోజూ స్నానం చేసి ఫ్రెష్ గా ఉండటం లేదని భర్త ఆరోపిస్తున్నాడు. రోజూ స్నానం చెయ్యడం మంచిదికాదని భార్య అంటోంది. ఇలాంటి విషయంలో విడాకులు కావాలని దంపతులు సిద్దం కావడం ఇంత వరకు మేము ఎప్పుడూ చూడలేదని, ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తున్నామని పోలీసులు అంటున్నారు.

రెండు సంవత్సరాల క్రితం పెళ్లి
ఉత్తరప్రదేశ్ లోని ఆలీగఢ్ లో షేక్ బాషా (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం పెద్దలు చూపించిన రజియా బేగం (పేరు మార్చడం జరిగింది) అనే యువతితో షేక్ బాషా సంతోషంగా వివాహం చేసుకున్నాడు. షేక్ బాషా, రజియా బేగం దంపతులు ఓ పాపకు తల్లిదండ్రులు అయ్యారు.

గొడవలు.... పెద్దలు పంచాయితీలు
రానురాను షేక్ బాషా, రజియా బేగం దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. షేక్ బాషా, రజియా బేగం దంపతుల కుటుంబ సభ్యులు, బంధువులు సంవత్సరం నుంచి ఇద్దరి మద్య పంచాయితీలు చేసి రాజీ చెయ్యడానికి ప్రయత్నించారు. షేక్ బాషా, రజియా బేగం దంపతుల మద్య రాజీ కదురకపోవడంతో పెద్దలు చేతులు ఎత్తేశారు.

మూడుసార్లు తలాక్ చెప్పేసిన భర్త
నా భార్య రజియా బేగం నేను చెప్పినట్లు వినడం లేదని ఆరోపిస్తూ భర్త షేక్ బాషా మూడుసార్లు తలాక్...... తలాక్..... తలాక్ చెప్పేసి ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. నా భర్త షేక్ బాషా తనకు అనవసరంగా విడాకులు ఇచ్చాడని, నా కాపురం మీరే నిలబెట్టాలని అతని భార్య రజియా బేగం మహిళా సెల్ పోలీసులను ఆశ్రయించింది.

పోలీసుల మైండ్ బ్లాక్
షేక్ బాషా, రిజియా బేగం దంపతుల మద్య ఏం జరిగింది ? అని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. దంపతుల మద్య జరిగిన అసలు మ్యాటర్ తెలుసుకుని పోలీసుల మతిపోయింది. ఇలాంటి విషయంలో విడాకులు కావాలని షేక్ బాషా, రజియా బేగం దంపతులు సిద్దం కావడం ఇంత వరకు మేము ఎప్పుడు చూడలేదని ఆలీగఢ్ పోీసులు అంటున్నారు.

నా భార్య స్నానం చేసి ఫ్రెష్ గా ఉండటం లేదు
నా భార్య రజియా బేగం రోజూ స్నానం చేసి ఫ్రెష్ గా ఉండటం లేదని, ఆమె పక్కకు వస్తే దుర్వాసన వస్తోందని, బెడ్ రూమ్ లో ఆమెతో హ్యాపీగా సంసారం చెయ్యలేకపోతున్నానని ఆమె భర్త షేక్ బాషా ఆరోపిస్తున్నాడు. నువ్వు ఎందుకు రోజూ స్నానం చెయ్యడం లేదని, నీ భర్త చెప్పినట్లు నడుచుకోవాలని పోలీసులు రజియా బేగంకు చెప్పారు.

రోజూ స్నానం చెయ్యకూడదని వాదిస్తున్న భార్య
రోజూ స్నానం చెయ్యడం మంచిది కాదని రజియా బేగం అంటోంది. నేను రోజూ స్నానం చెయ్యడానికి వీలుకాదని రజియా బేగం అంటోంది. ఇలాంటి చిన్నచిన్న విషయాలకు విడాకులు తీసుకుంటే పుట్టిన బిడ్డమీద ప్రభావం పడే అవకాశం ఉందని, ఇలాంటి విషయంలో విడాకులు కోసం కోర్టును ఆశ్రయించిన సంఘటనాలు మేము ఇంత వరకూ చూడలేదని ఉత్తరప్రదేశ్ పోలీసులు అంటున్నారు.
Recommended Video

ఇప్పుడు ఇదే హాట్ టాపిక్
దంపతులు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తున్నామని, త్వరలోనే రాజీ చేస్తామని, వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నామని ఆలీగఢ్ పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం మీద స్నానం చేసే విషయంలో గొడవలు జరిగి భర్త విడాకులు కావాలని డిమాండ్ చెయ్యడం ఉత్తరప్రదేశ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications