కంపెనీలో మేడమ్ మేనేజర్, కానీ సార్ ?, ఒకే ఇంటిలో ఏం చేశారంటే ?, నార్త్ ఇండియన్ !

బెంగళూరు: ఉన్నత విద్యాభ్యాసం చేసిన యువతి కార్పోరేట్ కంపెనీలో మేనేజర్ స్థాయి ఉద్యోగం చేస్తున్నది. అదే సమయంలో అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడు లేడీ మేనేజర్ కు పరిచయం అయ్యాడు. ఇద్దరూ స్నేహితులు అయ్యారు. తరువాత ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లికి ముందే ఒకే ఇంటిలో సహజీవనం చెయ్యడం మొదలుపెట్టారు. చాలాకాలం సహజీవనం చేసిన యువతి అదే ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైయ్యింది. ఈ కేసు ఇప్పుడు ఐటీ హబ్ పోలీసులకు సవాలుగా మారింది.

సహజీవనం చేస్తున్న యువతిని హత్య చేసిన ఆమె ప్రియుడిని పట్టుకునేందుకు బెంగళూరు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. యువతి హత్యకు గురైన ఈ ఘటన బెంగళూరులో కలకలం రేపుతోంది. ఆకాంక్ష (24) బెంగళూరులోని ప్రముఖ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తోంది. గతేడాది ఇదే కంపెనీలో పనిచేస్తున్న అర్బిత్‌ (27)తో ఆకాంక్షకు పరిచయం ఏర్పడింది.

A North Indian boyfriend who was in a relationship with his girlfriend and escaped after murdering her.

స్నేహంగా మొదలైన ఆకాంక్ష, అర్పిత్ ల బంధం తర్వాత రానురాను లివింగ్‌ టుగెదర్‌గా మారిపోయింది. ఆకాంక్ష, అర్పిత్ ఇద్దరూ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. పెళ్లికి ముందే ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే కొంత కాలంగా ఇద్దరి మధ్య అభిప్రాయవిభేదాలు రావడంతో అప్పుడప్పుడు అర్పిత్, ఆకాంక్షల మధ్య మాటల యుద్దం జరిగినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

కొంతకాలం క్రితం అర్పిత్, ఆకాంక్ష ఇద్దరూ విడిపోయి వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. ఈనెల 5వ తేదీన ఆకాంక్ష ఉంటున్న ఇంటికి వెళ్లిన అర్పిత్ అతని మాజీ ప్రియురాలితో వాగ్వాదానికి దిగాడు. ఆసమయంలో ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగిందని తెలిసింది. సహనం కోల్పోయిన అర్పిత్ నానా చిందులు వేశాడని తెలిసింది. చివరికి అర్బిత్, ఆకాంక్షను హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ విషయం తెలుసుకున్న ఆకాంక్ష కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ ఘటన ఆత్మహత్యగా అనుమానించారు. తరువాత పోలీసుల విచారణలో సీన్ మారిపోయింది. ఆకాంక్షను హత్య చేసిన తర్వాత, అర్బిత్ ఆమె మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీసి ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. అయితే అర్పిత్ ప్లాన్ పూర్తిగా రివర్స్ కావడంతో అతను ఆందోళనతో అతను సెల్‌ఫోన్‌ అక్కడే వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు.

A North Indian boyfriend who was in a relationship with his girlfriend and escaped after murdering her.

ఇందుకు సంబంధించి ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసిన పోలీసులు వారం రోజులకు పైగా అర్పిత్ కోసం గాలిస్తున్నారు. అర్పిత్ అతని సొంత సిటీ అయిన ఢిల్లీకి వెళ్లి ఉండవచ్చనే కోణంలో పోలీసులు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలు ఉన్నప్పటికీ పోలీసులు నిందితుడు అర్పిత్ ను పట్టుకోలేకపోతున్నారు.

సహజీవనం చేస్తున్న ఆకాంక్ష ఆమె ప్రియుడి చేతిలోనే హత్యకు గురికావడం బెంగళూరులో కలకలం రేపింది. మరణించిన ఆకాంక్ష ఆమె కుటుంబంలో పెద్ద కూతురు. ఆకాంక్షకు ఇద్దరు చెల్లెళ్లు ఓ తమ్ముడు ఉన్నారు. ఆకాంక్ష ద్వారానే ఆర్థిక అవసరాలు తీర్చుకుంటున్నామని ఆమె తండ్రి జ్ఞానేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అర్బిత్ ఎవరో తమకు తెలియదని, ఆకాంక్ష చనిపోయిన తర్వాతే అతడి గురించి తెలిసిందని ఆమె తండ్రి చెప్పారని పోలీసు అధికారులు అంటున్నారు. అర్పిత్ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. అయితే కన్నింగ్ అర్పిత్ మాత్రం పోలీసులకు చిక్కడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+