పాగల్ ప్రేమికుడు, రెండేళ్లు వెంటాడి నడిరోడ్డులో కాల్చి చంపేశాడు, ఇల్లు ఫినిష్ !
భోపాల్/ మధ్యప్రదేశ్: ఓ యువతి కాలేజ్ చదువుతున్న సమయంలో ఓ యువకుడు ఆమె వెంటపడ్డాడు. అయితే యువతి మాత్రం ఆ యువకుడిని పట్టించుకోలేదని తెలిసింది. రెండు సంవత్సరాల పాటు యువతిని వెండించి టార్చర్ చేసిన యువకుడు ఆమెను నడిరోడ్డులో కాల్చి చంపేయడం కలకలం రేపింది.
మధ్యప్రదేశ్ లోని ధార్ ప్రాంతంలోని బ్రాహ్మకుండ ప్రాంతంలో పూజా అనే యువతి నివాసం ఉంటున్నది. అదే ప్రాంతంలో దీపక్ రాథోడ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. పూజా కాలేజ్ లో చదువుతున్నప్పటి నుంచి దీపక్ రాథోడ్ ఆమె వెంటపడుతూ తనను ప్రేమించాలని ఆమెకు చెప్పాడు. అయితే దీపక్ రాథోడ్ ను ప్రేమించడానికి పూజా నిరాకరించింది.
అందరు అమ్మాయిల్లా పూజా కూడా మొదట బెట్టు చేస్తోందని, ఆమెను ఎలాగైనా తన వలలో పడేసుకోవాలని దీపక్ రాథోడ్ ఆమె వెంటపడుతూనే ఉన్నాడు. నువ్వు నన్ను ప్రేమించాలని, నన్నే పెళ్లి చేసుకోవాలని పూజా మీద దీపక్ రాథోడ్ ఒత్తిడి చెయ్యడం మొదలుపెట్టాడు. అయితే పూజా మాత్రం దీపక్ రాథోడ్ గురించి పట్టించుకోవడం మానేసింది.

రెండు సంవత్సరాల నుంచి దీపక్ రాథోడ్ పట్టువదలని విక్రమార్కుడిలా పూజా వెంటపడుతూనే ఉన్నాడు. ఇటీవల పూజా వన్ సైడ్ లవర్ దీపక్ రాథోడ్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చిందని తెలిసింది. దీపక్ రాథోడ్ టార్చర్ తట్టుకోలేక కొంతకాలం క్రితం పూజా ధార్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అతనికి వార్నింగ్ కూడా ఇచ్చారని తెలిసింది.
పూజా తనకు దక్కదు అని డిసైడ్ అయిన దీపక్ రాథోడ్ రివాల్వర్ జోబులో పెట్టుకుని వెళ్లి ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్న పూజా మీద నడిరోడ్డులో కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయాలు దూసుకుపోవడంతో పూజా స్పాట్ లో ప్రాణాలు వదిలేసింది. పూజాను హత్య చేసిన దీపక్ రాథోడ్ అతని ఇంటికి వెళ్లిపోయి హ్యాపీగా ఉన్నాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు పూజాను హత్య చేసిన దీపక్ రాథోడ్ ను అరెస్టు చెయ్యడానికి అతని ఇంటికి వెళ్లారు. ఆ సందర్బంలో పాగల్ ప్రేమికుడు దీపక్ రాథోడ్ పోలీసులు మీద కాల్పులు జరిపి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో దీపక్ రాథోడ్ కాలిలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి.
పూజాకు తండ్రి లేడని, అందుకే దీపక్ రాథోడ్ ఆమెను ఎక్కువగా టార్చర్ పెట్టాడని పోలీసులు అన్నారు. మధ్యప్రదేశ్ పోలీసులు పాగల్ ప్రేమికుడు దీపక్ రాథోడ్ ఇంటిని నేలమట్టం చేశారు. పూజాను నడిరోడ్డులోదారుణంగా కాల్చి చంపిన దీపక్ రాథోడ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్తానికులు డిమాండ్ చేస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications