ఆ ప్యూన్ కోటీశ్వరుడు: ఆరు భవనాలు, 2లగ్జరీ కార్లు..!

గ్వాలియర్: ప్యూన్ ఉద్యోగం చేస్తున్నాడంటే ఏదో సాదా సీదాగా జీవనం సాగిస్తున్నాడనుకుంటాం. కానీ ఈ ప్యూన్ మాత్రం 30ఏళ్లుగా అదే ఉద్యోగం చేసుకుంటూ కోటీశ్వరుడయ్యాడు. రెండు లగ్జరీ కార్లను కూడా కొన్నాడు. ఆయనకు ఓ డుప్లెక్స్ ఇళ్లుతోపాటు మరో ఐదు భవనాలు ఉన్నాయి. ఇదంతా ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఏసిబి శాఖ అధికారులు చేసిన దాడుల్లో వెల్లడైంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో కుల్‌దీప్ యాదవ్ అనే వ్యక్తి 1983 నుంచి ఓ సహకార బ్యాంకులో ప్యూన్‌గా పని చేస్తున్నాడు. అప్పటి నుంచి ప్రమోషన్లు కూడా ఏమి రాలేదు. ఎప్పుడూ నోరెత్తకుండా ఉండటంతో అంత ఆస్తి ఉందని ఎవరూ ఊహించలేదు.

A Peon for 30 Years, He has Six Houses, Two Luxury Cars and More

కాగా, ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో మంగళవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో లోకాయుక్తా, ఏసిబి అధికారులు, పోలీసులు కులదీప్ ఇళ్లల్లో సోదాలు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు రూ. 3 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. సోదాల్లో రెండు లగ్జరీ కార్లు, ఆరు భారీ భవంతులు, నగలు, నగదు, బ్యాంక్ లాకర్లు అధికారులు గుర్తించారు.

రాత్రికి సోదాలు పూర్తయ్యేసరికి ఆస్తుల విలువ రూ. 7 వరకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అతని నెల జీతం రూ. 20వేల కంటే ఎక్కువగా ఉండదని, ఈ జీతంతో 30ఏళ్లలో మహా అయితే రూ. 15-17 లక్షలు మాత్రమే సంపాదించాలని ఓ అధికారి వ్యాఖ్యానించారు. కానీ ఏకంగా ఏడు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయనుకుంటేనే అధికారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అవినీతికి పాల్పడే ఇన్ని ఆస్తులు కూడబెట్టి ఉంటాడని అధికారులు అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+