Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోలీసు అక్రమ సంబంధం, అర్దరాత్రి ఇద్దరూ అంతం, ఒకే చీరతో ? అదే ఊర్లో భార్య !

ఓ పోలీసు కానిస్టేబుల్ వేరే మహిళతో కలిసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్ణాటకలోని హుబ్బళిలోని నవనగర్ శివానంద నగర్‌లో చోటుచేసుకుంది.మహేశ్ (31), విజయలక్ష్మి (30) అనే ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. విచిత్రం ఏమిటంటే మహేష్, విజయలక్ష్మి దంపతులు కాదని, అయితే ఇద్దరూ ఓ ఇంటిలో ఒకే చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసు అధికారులు అంటున్నారు.

కానిస్టేబుల్ మహేష్ వాస్తవానికి గదగ్ జిల్లా లక్ష్మేశ్వర్ నివాసి. హుబ్బళి -ధారవాడలో మహేష్ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇక విజయలక్ష్మి ఓ హోటల్‌ పెట్టుకుని గామనగట్టి ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. మహేష్ కు కొన్ని సంత్సరాల క్రితం వేరే మహిళతో వివాహం అయ్యింది. మహేష్ అతని భార్యతో కలిసి హుబ్బళిలో నివాసం ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. తరువాత మహేష్, విజయలక్ష్మిలకు పరిచయం అయ్యింది.

A policeman committed suicide by hanging himself in the same house along with a woman

రానురాను ఇద్దరి పరిచయం అక్రమ సంబంధానికి దారితీసిందని కానీస్టేబుల్ మహేష్ కు తెలిసినవాళ్లు అంటున్నారు. పోలీసు కానిస్టేబుల్‌ మహేష్ కు కొన్ని సంవత్సరాల క్రితమే పెళ్లయినా భార్యతో అతనికి పొంతన కుదరలేదని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. దీంతో విజయలక్ష్మి తో అక్రమ సంబంధం పెట్టుకున్న మహేష్ ఆమెతోనే ఎక్కువగా కాలం గడుపుతున్నాడని అతని బంధువులు చెబుతున్నారు.

ఏడాది క్రితమే అద్దె ఇంటికి వచ్చిన కానిస్టేబుల్‌ మహేష్ కు విజయలక్ష్మికి పరిచయం ఏర్పడింది. అయితే వీరిద్దరూ ఒకే చీరతో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలియరాలేదు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారా. లేకపోతే ఇద్దరిని హత్య చేసి ఉరివేసుకున్నారని నమ్మించడానికి ప్రయత్నించారా అనేది కచ్చితంగా తెలియరాలేదని హుబ్బళి-ధారవాడ జంట నగరాల పోలీసు అధికారులు అంటున్నారు.

మహేష్, విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న గదిలో చిన్న పాయిజన్ బాటిల్ పడివుందని పోలీసులు అన్నారు. మొదట విజయలక్ష్మికి విషమిచ్చి తరువాత ఆమెతో కలిసి మహేష్ ఆత్మహత్యకు పాల్పడే అవకాశం కూడా ఉందని పోలీసులు అంటున్నారు. ఇద్దరి మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభించగా వారు ఎప్పుడు ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలియరాలేదని పోలీసులు అంటున్నారు. హుబ్బళిలోని నవనగర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+