సీఎంకు తలనొప్పి, ఇసుక మాఫియా, సొంత పార్టీ లీడర్ పేరు రాసి డాక్టర్ ఆత్మహత్య !

కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ వైద్యుడు శశిధర్ హట్టి అలియాస్ శశిధర్ సోమవారం రాత్రి కర్ణాటకలోని గదగ్ జిల్లా రోనా తాలూకా హిరేహాల గ్రామంలో డెత్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డాక్టర్ శశిధర్ ఇంట్లో లుంగీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు .

ఇసుక స్మగ్లర్, కాంగ్రెస్ నాయకుడు శరణ్ గౌడ్ పాటిల్ పేరు రాసిన డాక్టర్ శశిధర్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

 A prominent doctor committed suicide by writing his own party leaders name in the death note in Karnataka.

ఇసుక అక్రమ రవాణాలో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇసుక తరలిస్తున్న అకౌంట్లు మొత్తం చూపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరణ్ గౌడ్ తనను పదే పదే వేధించాడని, అందుకే ఆవేదనతో తాను ఆత్మహత్య చేసుకున్నట్లు డాక్టర్ శశిధర్ డెత్ నోట్ లో రాశాడని పోలీసులు తెలిపారు. శరణ్‌ గౌడ్‌ను కఠినంగా శిక్షించాలని గదగ్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి హెచ్‌కే పాటిల్‌కు, జిల్లా పోలీసు అధికారికి డెత్ నోట్ లో డాక్టర్ శశిధర్ మనవి చేశారు

రోణ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి రోణ పోలీస్ స్టేషన్ కేసు నమోదు అయ్యిందని, విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కర్ణాటకలో ఇసుక మాఫియా ఎక్కువ అయ్యిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయాకులు కొన్ని నెలలుగా ఆరోపిస్తున్నారు.

 A prominent doctor committed suicide by writing his own party leaders name in the death note in Karnataka.

సొంత పార్టీకి చెందిన నాయకులు ఇసుక దందా కోసం పోటాపోటీ పడుతున్నారని, కొందరు ఎమ్మెల్యేలు, ఇంకా కొందరు మంత్రుల మద్దతుతో ఇసుక తరలించడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సొంతపార్టీకి చెందిన ఇద్దరు నాయకులు గొడవపడటం, ఒకరు ఆత్మహత్య చేసుకోవడంతో సీఎం సిద్దరామయ్య, డీకే శికుమార్ సీరియస్ అయ్యారని తెలిసింది. ఇసుక డిమాండ్ విపరీతంగా ఉండటంతో ఇప్పుడు దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇసుక తరలించడానికి అధికార పార్టీకి చెందిన నాయకుల మధ్య పోటీ పెరిగిపోతా ఉందని వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+