Railway: మహిళతో రైల్వే టీటీఈ అనుచిత ప్రవర్తన.. అరెస్ట్ చేసిన పోలీసులు..

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన రైల్వే టిటీఈని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని తిరువనంతపురం జిల్లా నిలంబూరు నుంచి కొచ్చువేలి వెళ్తున్న ప్యాసింజర్ రైలులో రైల్వే టిటిఈ మహిళతో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ఆ రైల్వే టికెట్ ఎగ్జామినర్‌ను కొట్టాయం రైల్వే స్టేషన్‌లో మంగళవారం అరెస్టు చేశారు. రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ రైలులో నిలంబూర్-కొచువేలి మార్గంలో అలువా స్టేషన్ దాటిన తర్వాత మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగిందని కొట్టాయం రైల్వే పోలీసు అధికారి తెలిపారు.

మహిళ ఫిర్యాదు ప్రకారం, ఆమె RAC టిక్కెట్‌ను కలిగి ఉంది. రైలులోని S-4 కోచ్‌లో కూర్చున్నప్పుడు టిక్కెట్ ఎగ్జామినర్ (TE) వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అతను లేవకుండా ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె వెంటనే తిరువనంతపురంలోని రైల్వే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసింది. రైలులో ఉన్న RPF సిబ్బందికి సమాచారం అందించింది. RPF సిబ్బంది నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించినట్లు తేలిందని అధికారి తెలిపారు.

TTE was arrested for misbehaving with a woman

నిందితుడిని కోర్టులో హాజరుపరచగా అతనికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇలాంటి వాటిని అరికట్టేందుకు రైల్వే శాఖ చర్యలు చేపడుతుంది. టికెట్‌ తనిఖీల్లో పారదర్శకత, రైలు ప్రయాణాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనను అరికట్టేందుకు గానూ టికెట్‌ తనిఖీ అధికారులకు బాడీ కెమెరాలు అమర్చడానికి సిద్ధమైంది. సెంట్రల్ రైల్వే (CR) జోన్‌లోని ముంబై డివిజన్‌లో ఈ కొత్త విధానాన్ని తీసుకురానున్నారు. ఈ డివిజన్‌లో 50 బాడీ కెమెరాలను అమర్చనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ విజయవంతం అయితే దేశమంతటా ఈ విధానం అమలు చేయనున్నారు.

ముంబై డివిజన్ రైళ్లలో ప్రయాణీకుల టిక్కెట్లను తనిఖీ చేయడానికి అనేక చర్యలు తీసుకుంది. ఈ చర్య పారదర్శకతను తీసుకురావడం, సిబ్బందిపై ఫిర్యాదులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ముంబై డివిజన్‌లోని రైల్వే టికెట్ తనిఖీదారులకు బాడీ కెమెరాలను అందజేస్తున్నారు. టికెట్ తనిఖీ సమయంలో కెమెరాలు పారదర్శకతను నిర్ధారిస్తాయి. ముఖ్యంగా ఫిర్యాదుల సందర్భంలో టిక్కెట్ తనిఖీ సమయంలో ఏదైనా వ్యత్యాసాన్ని గుర్తించడంలో కెమెరా సహాయపడుతుంది. పైలట్ ప్రాజెక్ట్‌గా, జోనల్ రైల్వే ఒక్కోటి రూ.9,000 చొప్పున 50 కెమెరాలను కొనుగోలు చేసింది. ఈ కెమెరాలు దాదాపు 20 గంటల ఫుటేజీని రికార్డ్ చేయగలవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+