వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జీ తీర్పు: కన్నీళ్లు పెట్టుకున్న కనిమొళి, ఎ రాజాతో ఆలింగనం, ఎవరేమన్నారంటే?

|
Google Oneindia TeluguNews

Recommended Video

2G spectrum scam : 2జీ స్కాం: డీఎంకే సంబరాలు, వీడియో !

న్యూఢిల్లీ: దేశంలో సంచలన సృష్టించిన 2జీ స్కాం కేసులో పటియాల హౌస్ కోర్టు గురువారం తీర్పు వెలువరిస్తూ.. ప్రధాన నిందితులైన ఎ రాజా, కనిమొళిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.

2జీ కేసులో రాజా, కనిమొళిలు నిర్దోషులు: పటియాల కోర్టు సంచలన తీర్పు2జీ కేసులో రాజా, కనిమొళిలు నిర్దోషులు: పటియాల కోర్టు సంచలన తీర్పు

కనిమొళి, రాజాతోపాటు నిందితులుగా ఉన్న మిగితావారిని కూడా నిర్ధోషులుగా ప్రకటించింది. నేరం నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది.

కన్నీళ్లు పెట్టుకున్న కనిమొళి

ఈ క్రమంలో కనిమొళి తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.తన కుటుంబం, పార్టీ నేతలు అందరూ అండగా ఉన్నారని చెప్పారు.

రాజాతో ఆలింగనం

తీర్పు రాగానే ఏ రాజాను ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు కనిమొళి. తనకు మద్దతుగా నిలిచిన అందరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

నమ్మకముందంటూ రాజా

తీర్పు అనంతరం రాజా మాట్లాడుతూ.. తనకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని చెప్పారు. కోర్టు తీర్పు రాగానే డీఎంకే నేతలు, కార్యకర్తలు.. సత్యమేవ జయతే అంటూ ప్లకార్లులను ప్రదర్శించారు. కాగా, తమిళనాడులో డీఎంకే కార్యకర్తలు, నేతలు టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

వీరంతా కూడా నిర్ధోషులే

కనిమొళి, రాజాతోపాటు మాజీ టెలీకాం సెక్రటరీ సిద్ధార్త్ బెహురా, రాజా ప్రైవేటు సెక్రటరీ ఆర్కే చండోలియా, స్వాన్ టెలీకాం ప్రమోటర్స్ షాహిద్ ఎస్మాన్ బల్వా, వినోద్ గోయంకా, యూనిటెక్ లిమిటెడ్ ఎండీ సంజయ్ చంద్ర, రిలియన్స్ అనిల్ ధీరూభాయి అంబానీ గ్రూప్(రాడాగ్) టాప్ ఎగ్జిక్యూటివ్స్ గౌతమ్ దోషి, సురేంద్ర పిపారా, హరినాయర్ లు దోషిగా తేలారు.

సీబీఐ, ఈడీ

కేసు విచారణ సందర్భంగా కనిమొళి తల్లి, భర్త కూడా కోర్టుకు వచ్చారు. కాగా, తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేసేందుకు సీబీఐ, ఈడీ సిద్ధమవుతున్నాయి.

నిజం గెలిచిందంటూ

కోర్టు తీర్పుతో నిజం గెలిచిందని మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. నాటి యూపీఏ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన వారికి ఇది చెంపపెట్టు అని అన్నారు. కాంగ్రెస్ ను విమర్శించిన వారు ఇప్పటికైనా నిజం తెలుసుకోవాలని అన్నారు. కోర్టు తీర్పును డీఎంకే అధినేత స్టాలిన్ కూడా స్వాగతించారు. ఇది చరిత్రాత్మక తీర్పు అని వ్యాఖ్యానించారు.

వినోద్ రాయ్ క్షమాపణ చెప్పాలి..

2జీ కేసులో కోర్టు తీర్పు అనంతరం తన మాట గెలిచిందని, ఎలాంటి అవినీతి జరగలేదని అన్నారు .ఏదైనా స్కాం జరిగితే అది అబద్ధపు స్కామేనని అన్నారు. అంతేగాక, వినోద్ రాయ్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శశిథరూర్ కూడా కోర్టు తీర్పును స్వాగతిస్తూ వాస్తవం వెలుగు చూసిందని అన్నారు.

స్పందించిన అన్నా హాజరే

ఒక వేళ ప్రభుత్వం వద్ద అన్ని ఆధారాలుంటే 2జీ కేసులో హైకోర్టుకు వెళ్లవచ్చని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త అన్నా హజారే అన్నారు.

English summary
Former Telecom Minister A. Raja has been acquitted in the 2G spectrum case, along with all other accused, including Rajya Sabha MP Kanimozhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X