ఐటీ హబ్ లో రాత్రి ఆటోలో ఏం జరిగింది, ర్యాపిడో ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే ?, ఎదురు తిరిగిందని !

ఐటీ హబ్ బెంగళూరు నగరంలో కొందరు ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు మహిళా ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు అనేకసార్లు వెలుగు చూసినా ఆ డ్రైవర్ల తీరుమాత్రం మారలేదు. కొందరు చూసిచూడనట్లు వ్యవహరించినా కొందరు సంబందిత అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కొన్ని కేసులు నమోదు చెయ్యడం, కొన్ని కేసులో గాలికి వదిలేయడంతో అలాంటి కామాంధులైన డ్రైవర్లు మళ్లీ మహిళా ప్రయాణికులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు.

బెంగళూరులో ర్యాపిడో ఆటో డ్రైవర్ ఓ యువతిని లైగింక వేధింపులకు గురిచేశాడు. ఆ సందర్బంలో ధైర్యం చేసిన యువతి వేగంగా వెలుతున్న ఆటోలోనే ప్రతిఘటించినందుకు ఆ ఆటో డ్రైవర్ ఆమెను ఆటోలో నుంచి కిందకు తోసేశాడు. దీనిపై బాధితురాలు వెంటనే సంబంధిత ర్యాపిడో సంస్థ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని తెలిసింది.

A Rapido auto driver sexually assaulted a young woman traveling alone in an auto in Bengaluru city.

అంకుర్ బాగ్చీ అనే యువకుడు తన స్నేహితురాలితో ఒక ఆటో డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడని, ఆమె శరీరం మీద ఎక్కడపడితే అక్కడ తాకడంతో ఆమె నానా ఇబ్బందులు ఎదుర్కొందని, ఆటో డ్రైవర్ మీద ఆమె తిరగబడిందని, అయినా ఆటో డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోలేదని అతను ట్విట్టర్ లో వివరించాడు. ఆమె అభ్యంతరం చెప్పడంతో కదులుతున్న ఆటోలో నుండి బలవంతంగా బయటకు తోసేశాడని అంకుర్ బాగ్సీ ట్విట్టర్ లో పోస్టు చేశాడు.

ఆటోలో వెళ్లే సమయంలో మొదట ఆ ఆటో డ్రైవర్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని, పెద్ద గొంతుతో మాట్లాడుతూ తనను ఇబ్బంది పెట్టాడని ఆ యువతి ఆమె స్నేహితుడికి చెప్పింది. తరువాత ఇంత తతంగం జరిగిందని బాధితురాలి స్నేహితుడు అంకుర్ బాగ్సీ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

A Rapido auto driver sexually assaulted a young woman traveling alone in an auto in Bengaluru city.

అంతేకాదు తన స్నేహితురాలు ర్యాపిడో సంస్థకు ఫిర్యాదు చేసినా ఆ కంపెనీ సక్రమంగా స్పందించలేదని, కేవలం క్షమాపణ మాత్రమే చెప్పి సైలెంట్ గా ఉండిపోయిందని అంకుర్ బాగ్సీ విచారం వ్యక్తం చేశాడు.

ఆటోలో యువతిని లైంగిక వేధింపులకు గురి చేసిన ఆటో డ్రైవర్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆటో డ్రైవర్ వివరాలు బయటకు చెప్పడం లేదని, ర్యాపిడో ఆటోలో సంచరించడం సురక్షితం కాదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసిందని ఆమె స్నేహితుడు ఆరోపించాడు. అంకుర్ బాగ్సీ ఆరోపణలు చేసిన తరువాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడటంతో పోలీసులు మరుసటి రోజు రంగంలోకి దిగి గుర్తు తెలియని ర్యాపిడో ఆటో డ్రైవర్ మీద కేసు నమోదు చేశారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+