ప్రశాంతంగా ఉన్న గ్రామంలో చిచ్చు పెట్టిన కోడిపుంజు- కేసులు, కొట్లాటలు గట్రా..

ప్రశాంతంగా ఉండే ఓ గ్రామంలో కోడిపుంజు చిచ్చుపెట్టింది. జనం మధ్య గొడవలు, ఘర్షణలు సాధారణం అయ్యాయి. వాళ్లను ఆపడం చివరికి పోలీసుల వళ్ల కూడా కాలేదు. ఫలితంగా ఏకంగా జిల్లా కలెక్టరే జోక్యం చేసుకోవాల్సొచ్చింది. కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగితే గానీ అక్కడి పరిస్థితులు కుదుట పడలేదంటే- దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆ ఊరి పేరు- పల్లిక్కల్. కేరళ పథనంథిట్ట జిల్లాలోని ఆదూర్ సమీపంలో ఉంటుంది. ఈ గ్రామంలో నివసించే అనిల్ కుమార్ వ్యక్తి కొన్ని కోళ్లను పెంచుకుంటోన్నాడు. ఇంటి టెర్రస్‌పై వాటికి ఆవాసం ఏర్పాటు చేశాడు. పగటి పూట ఎక్కడ తిరిగినా.. సాయంత్రానికి టెర్రస్‌పైకి చేరుకుంటాయవి. ఓ మినీ కోళ్లఫారాన్ని రన్ చేస్తోన్నాడు.

A rooster s crowing sparked dispute in Pallickal village in Kerala prompting the SDM to intervene

అక్కడి దాకా బాగానే ఉన్నప్పటికీ- వాటిల్లో ఉండే ఓ కోడిపుంజు తెల్లవారు జామున 3 గంటలకే కూత పెట్టడం అనేది ఈ గొడవలు, ఘర్షణలకు దారి తీసింది. తెల్లవారు జామునే ఆ కోడి కేత పెట్టడం.. అనిల్ కుమార్ ఇంటి సమీపంలో నివసిస్తోన్న 70 సంవత్సరాల రాధాకృష్ణ కురుప్‌కు నచ్చలేదు.

వృద్ధాప్యం వల్ల ఏ అర్ధరాత్రో, అపరాత్రో నిద్రపడుతుందని, అంతలోపే అనిల్ కుమార్ పెంచుకునే కోడి కొక్కొరొకో అంటూ కూత పెట్టి మరీ తన నిద్రను చెడగొడుతోందనేది రాధాకృష్ణ కురుప్ వాదన. దీనిపై పలుమార్లు అనిల్ కుమార్‌కు చెప్పి చూసినప్పటికీ ఫలితం రాలేదు. ఆయనేమో పట్టించుకోలేదు.

దీనితో రెండురోజుల కిందట అనిల్ కుమార్‌తో గొడవకు దిగారు కురుప్. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లింది. వాళ్లిద్దరూ తమ బంధుమిత్రులను సైతం వెంట తెచ్చుకోవడంతో ఇది కాస్తా పెరిగి పెద్దదైంది. ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం స్థాయికి వెళ్లింది.

అక్కడితో ఆగలేదు రాధాకృష్ణ కురుప్. పోలీసులను ఆశ్రయించాడు. ఎలాంటి లైసెన్సు లేకుండా, అక్రమంగా అనిల్ కుమార్ కోళ్ల ఫారాన్ని రన్ చేస్తోన్నాడంటూ ఫిర్యాదు చేశాడు. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. తాత్కాలికంగా గొడవలు సద్దుమణిగినట్టే కనిపించినా మళ్లీ రాజుకున్నాయి. ఈ సారి కలెక్టర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

పల్లిక్కల్ గ్రామాన్ని సందర్శించారు. అనిల్ కుమార్ ఇంటికి వెళ్లారు. టెర్రస్‌పై నిర్వహిస్తోన్న కోళ్లఫారాన్ని తనిఖీ చేశారు. దీన్ని మరో చోటికి తరలించాలంటూ ఆదేశాలను జారీ చేశారు. 14 రోజుల్లోగా తరలింపు చర్యలు చేపట్టాలని, ఈ లోగా ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+