అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్లు దేశంలో ఎక్కువ అవుతున్నారు. మహిళలపై ఇలా ప్రవర్తిస్తున్న వారి మీద కేసులు నమోదు అవుతున్నా అలాంటి వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ ల్లో, కాలనీల్లో నివాసం ఉంటున్న మహిళలకు భద్రత కల్పించడానికి సెక్యూరిటీ గార్డులను నియమిస్తుంటారు. అయితే అదే సెక్యూరిటీ గార్డులు మహిళల మీద కన్ను వేస్తే పరిస్థితులు తారుమారు అవుతాయి.
కర్ణాటకలోని కలబురగిలో ఇటీవల మహిళలపై అత్యాచారాలు, పోలీసులపై దాడులు, హత్యలు, దోపిడీలు వంటి నేరాలు పెరిగిపోవడం స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
గత వారం రోజుల క్రితం జిల్లా శివారులో కూలీ పనులకు వెళ్లిన ఇద్దరు మహిళలు పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులపై రాళ్ల దాడి కూడా జరిగింది. ఇప్పుడు కలబురగి పట్టణంలో అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డు చేతివాటం చూపించాడు.

బాత్‌రూమ్‌లో ఉన్న మహిళను వీడియో రికార్డ్ చేసిన సంఘటన కలబురిగిలో కలకలం రేపింది. కలబురిగి
నగరంలోని రామమందిర్ సర్కిల్ సమీపంలో ఓ కుటుంబం ఓ అపార్ట్‌మెంట్ లోని ఫ్లాట్ ను అద్దెకు తీసుకుని అక్కడే నివాసం ఉంటోంది. నిందితుడు విశ్వనాథ్ అదే అపార్ట్ మెంట్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న కుటుంబాల దగ్గర సెక్యూరిటీ గార్డు విశ్వనాథ్ మంచితనంతో ఉండేవాడని తెలిసింది.
అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో నివాసం ఉంటున్న మహిళ బాత్‌రూమ్‌కు వెళ్లడాన్ని నిందితుడు విశ్వనాథ్ గమనించి వీడియో చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఇది చూసి ఆ మహిళ షాక్ అయ్యింది. వెంటనే భర్తకు ఫోన్ చేసిన మహిళ సెక్యూరిటీ గార్డు విశ్వనాథ్ విషయం చెప్పింది. ఆ తర్వాత సదరు మహిళ భర్త సెక్యూరిటీ గార్డును పట్టుకుని అపార్ట్‌మెంట్‌లోని అండర్‌గ్రౌండ్‌లోని పిల్లర్‌కు కట్టేశాడు. స్థానికులు సెక్యూరిటీ గార్డు విశ్వనాథ్‌ను చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు విశ్వనాథ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కలబురిగి నగరంలోని స్టేషన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.












Click it and Unblock the Notifications