అల్లుడా మజాకా, అత్తను పెళ్లి చేసుకున్న అల్లుడు, వీరలెవల్లో మామ కళ్లముందే హీరో !

అత్తను అల్లుడు పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఇది కలికాలం. ఈ కలికాలంలో ఏదైనా జరగొచ్చు, ఇలాంటి సంఘటనలు ప్రజలు చూసి ఆశ్చర్యపోతున్నారు, ఈ కలికాలం సీజన్‌లో నోటికి వచ్చినట్లు మాట్లాడటమే కాకుండా మనసుకు నచ్చినట్లు ప్రవర్తించడంతో చిత్రవిచిత్ర సంఘటనలు మనం చూడాల్సి వస్తుంది. కూతురితో కాపురం చేసిన వ్యక్తి ఆమె తల్లిని రెండో పెళ్లి చేసుకోవడంతో అందరూ బిత్తరపోయారు.

ఇలాంటి సంఘటన విదేశాల్లో అయితే ఓకే. కాని ఇలాంటి ఘటనే బీహార్‌లో జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఓ వ్యక్తి తన భార్య కన్న తల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. భార్య చనిపోవడంతో ఆ వ్యక్తి తన అత్తగారిని ప్రేమించి అతని మామను ఒప్పించి ఊరందరి సమక్షంలో పెళ్లి చేసుకున్న ఘటన బీహార్ బంకాలోని ఛత్రపాల్ పంచాయతీలోని హీర్మోతి గ్రామంలో చోటుచేసుకుంది.

A son-in-law who loves and marries his aunt in Bihar

హీర్మోతి గ్రామానికి చెందిన సికందర్ యాదవ్, అతని అత్త గీతా దేవి అందరి సమక్షంలో పెళ్లి చేసకుని వేరుగా కాపురం పెట్టారు. గీతా దేవి అనే మహిళను దిలేశ్వర్ దర్వే అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. దిలేశ్వర్, గీతా దేవి దంపతులకు ఒక కుమార్తె ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం దిలేశ్వర్, గీతా దేవి దంపతులు వారి కుమార్తెను సికందర్ యాదవ్‌ కు ఇచ్చి ఇద్దరి వివాహం జరిపించారు. గీతా దేవి కుమార్తెను పెళ్లి చేసుకున్న సికిందర్ యాదవ్ ఆమెతో చక్కగా కాపురం చేశాడు. అయితే దురదృష్టవశాత్తు సికిందర్ యాదవ్ భార్య అనారోగ్యంతో చనిపోయింది.

భార్య చనిపోయిన తర్వాత సికిందర్ యాదవ్ ఒంటరి అయ్యాడు. భార్య చనిపోయిన తర్వాత కూడా సికిందర్ యాదవ్ అతని మామ దిలేశ్వర్ దర్వే ఇంట్లోనే ఉండడం ప్రారంభించాడు. కొంతకాలంగా సికిందర్ యాదవ్ అతని మామ దిలేశ్వర్ ఇంట్లోనే ఉంటున్నాడు. భార్య లేకుండా ఒంటరిగా ఉన్న సికిందర్ యాదవ్ మరో పెళ్లి చేసుకోవాలని అమ్మాయిల పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. సికిందర్ యాదవ్ రెండో పెళ్లి చేసుకోవడానికి అతని మామ దిలేశ్వర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదే సమయంలో సికిందర్ యాదవ్ కోసం అమ్మాయిని వెతకడం మొదలుపెట్టారు.

ఇదే సమయంలో సికిందర్ యాదవ్ అతని అత్త గీతా దేవితో చనువుపెంచుకున్నాడు. అత్త గీతా దేవి, ఆమె అల్లుడు సికిందర్ యాదవ్ ఒకరికొకరు సన్నిహితంగా ఉంటున్నారని తెలిసింది. ఒకే ఇంట్లో అత్తా అల్లుడు ఒంటరిగా ఉన్న సమయంలో వారి చనువు రానురాను అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయంలో గీతా దేవి కుటుంబ సభ్యులకు అనుమానాలు ఉన్నాయి. అయితే అధికారికంగా ఎవరూ ఈ విషయం బయటకు చెప్పకపోవడంతో కొంతకాలం ఆ విషయం రహస్యంగానే ఉండిపోయింది.

అత్తా, అల్లుడు అక్రమ సంబందం వ్యవహారం తెలుసుకున్న మామ దిలేశ్వర్ ఇద్దరినిన రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని గ్రామ పెద్దల ముందు పంచాయితీ పెట్టాడు. పంచాయితీలో గ్రామ పెద్దలు జరిపిన విచారణలో తన అత్తతో తనకు అక్రమ సంబందం ఉందని సికందర్ యాదవ్ తన అత్త మీద ఉన్న ప్రేమను బాహాటంగానే చెప్పాడు. ఎట్టకేలకు అత్త, అల్లుడు ప్రేమ వ్యవహారం ఊరందరికి తెలిసిపోయింది.

A son-in-law who loves and marries his aunt in Bihar

తాను వేరే పెళ్లి చేసుకోనని, మా మామ దిలేశ్వర్ అంగీకరిస్తే తన అత్త గీతా దేవిని నేను పెళ్లి చేసుకుంటానని సికిందర్ యాదవ్ చెప్పడంతో గ్రామ పెద్దలు, ఊరి ప్రజలు హడలిపోయారు. అయితే తన భార్య గీతా దేవి తన అల్లుడు సికిందర్ యాదవ్ తో అక్రమ సంబందం పెట్టుకోవడంతో మనసు విరిగిపోయిన దిలేశ్వర్ కు ఏం చెయ్యాలో దిక్కుతోచక కొంత సేపు సైలెంట్ అయిపోయాడని తెలిసింది.

తన భార్య గీతా దేవికి తాను ఇక్కడే విడాకులు ఇచ్చేస్తానని, తన అల్లుడు సికిందర్ యాదవ్ ను ఆమె పెళ్లి చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మామ దిలేశ్వర్ గ్రామ పెద్దలకు చెప్పాడు. మామ దిలేశ్వర్, గ్రామ పెద్దలు అంగీకారంతో వారందరి సమక్షంలో సికిందర్ యాదవ్ అతని అత్త గీతా దేవిని పెళ్లి చేసుకున్నాడు. గీతా దేవి ఆమె భర్త నుండి విడిపోయి అందరి సమక్షంలో అల్లుడు సికిందర్ యాదవ్ ను వివాహం చేసుకుందని స్థానిక మీడియా తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+