బెంగళూరు బంద్ కు ఎన్ని సంఘాలు మద్దతు అంటే ?, తమిళ సంఘం ఎంట్రీతో షాక్ !

బెంగళూరు/చెన్నై: కర్ణాటకలో పుట్టిన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి ప్రవహిస్తున్న కావేరీ జలాల (cauvery) పంపిణి వివాదంలో కర్ణాటక లేదా తమిళనాడు తరపున జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కావేరి నీటి పంపకాల విషయంలో కర్ణాటకలోని ప్రతిపక్షాలు, రైతు సంఘాల ఆగ్రహానికి దారితీసింది. ఈ నేపథ్యంలో వివిధ కన్నడ సంఘ, సంస్థలు బెంగళూరు (bengaluru) బంద్‌కు పిలుపునిచ్చాయి.

బెంగళూరు బంద్ కు ఐటీ హబ్ లోని బెంగళూరు (bengaluru) తమిళ సంఘం (tamil)మద్దతు తెలపడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. బెంగళూరు బంద్ కు కర్ణాటకలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ కూడా మద్దతు పలకడంతో బంద్ కు మంచి ఊపు వస్తోంది. సెప్టెంబర్ 26వ తేదీన మంగళవారం బెంగళూరు (bengaluru) నగరం బంద్ చేయాలని రైతు అనుకూల సంస్థలు నిర్ణయించాయి. బెంగళూరు (bengaluru) బంద్ కు మొత్తం 48 సంఘాలు బహిరంగంగా మద్దతు తెలిపాయి.

A total of 48 organizations along with the Tamil community have announced their support for the Bengaluru bandh

ఈ విషయమై మీడియా సమావేశంలో మాట్లాడిన రైతు సంఘం నాయకులు బెంగళూరులో (bengaluru) నివాసం ఉంటున్న ప్రజలు నిత్యం కావేరి నీరు తాగుతున్నారని, అదే కావేరి నీటి సమస్య ఎదురైతే పోరాటం చెయ్యడానికి ముందుకురావడం లేదని విచారం వ్యక్తం చేశారు. కావేరి నీరు పుష్కలంగా ఉన్న సమయంలో తమిళనాడుకు (tamil) ఆ నీరు వదిలినా పర్వాలేదని, ఇప్పుడు మాకు తాగడానికి, పంటలు పెట్టుకోవడానికి నీళ్లు లేకపోతే తమిళనాడుకు నీళ్లు ఎలా వదలాలని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

కావేరి నీటి విషయంలో మొండిపట్టు పడుతున్న తమిళనాడులోని (tamil) స్టాలిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 26వ తేదీన నిర్వహించనున్న బెంగళూరు (bengaluru) బంద్‌కు ఐటీ హబ్ ప్రజలు కూడా సంపూర్ణ మద్దతు తెలపాలని, బంద్ కు సహకరించి తమిళనాడు ప్రభుత్వ తీరును ఎండగట్టాలని రైతు సంఘాలు మనవి చేశాయి.

A total of 48 organizations along with the Tamil community have announced their support for the Bengaluru bandh

బెంగళూరు బంద్ కు బీజేపీ (bjp)సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం అయోమయంలో పడిపోయింది, బెంగళూరు (bengaluru) బంద్ విజయవంతం అయితే కావేరి నీటి విషయంలో బీజేపీ క్రెడిట్ కొట్టేస్తుందని, అలా అని బెంగళూరు (bengaluru) బంద్ ను అడ్డుకుంటే కావేరీ నీటి విషయంలో ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెలుతాయని కాంగ్రెస్ (congress) ప్రభుత్వం ఆలోచిస్తోంది. మొత్తం మీద బెంగళూరు బంద్ ను విజయవంతం చెయ్యడానికి ఇప్పటి నుంచే స్కెచ్ లు వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+